టీఆర్ఎస్ పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అంటే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. మంత్రి పదవులు ఆశించిన తాటికొండ రాజయ్య, జోగురామన్న, నాయిని నరసింహ్మా రెడ్డి, షకీల్ అహ్మద్ లాంటి వారు కేసీఆర్ పై కోపంతో ఉన్నారని ఆయన వివరించారు. నిన్న బోధన్ ఎమ్మెల్యే షకీల్ తనను కలిసి కేసీఆర్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాడని అరవింద్ వ్యాఖ్యానించారు. మైనార్టీలో కోటాలో మంత్రి పదవి అనుభవిస్తున్న హోంమంత్రి మహమూద్ అలీ డమ్మీ అని తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా పదవి ఇవ్వలేదని షకీల్ చెప్పినట్లు అరవింద్ వెల్లడించారు. పార్టీ మారుతున్నారా..లేదా.. ఆయనకే తెలియాలని అరవింద్ చెప్పారు.
previous post