28.2 C
Hyderabad
April 20, 2024 14: 52 PM
Slider ప్రత్యేకం

వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి బిజెపి కసరత్తు

#PanabakaLaxmi

తెలంగాణ దుబ్బాకలో విజయం సాధించినట్లే తిరుపతి పార్లమెంటు ఎన్నికలలో గెలవాలని ఆంధ్రప్రదేశ్ బిజెపి ఆశపడుతున్నది. దుబ్బాక విజయం తరహాలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ బిజెపి భావిస్తున్నది. దేశ వ్యాప్తంగా బిజెపి గాలులు వీస్తున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్ లో పాగా వేయాలని కూడా బిజెపి నాయకులు ఆలోచిస్తున్నారు. ఇందుకోసం కార్యాచరణ కూడా ఇప్పటికే ప్రారంభించారు.

ఎంపీ టికెట్ ఎవ‌రికో?

తిరుపతి పార్లమెంటు స్థానానికి గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బల్లి దుర్గాప్రసాద్ అకాల మరణంతో ఆ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. తిరుపతి ఎస్ సి రిజర్వుడు స్థానం నుంచి దీటైన అభ్యర్ధిని రంగంలో దించాలని బిజెపి ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్నది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి తిరుపతి టిక్కెట్ ఇస్తే బిజెపిలో చేరేందుకు సిద్ధపడుతున్నారు. పనబాక లక్ష్మి గత లోక్ సభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున తిరుపతి నుంచి పోటీ చేసి బల్లి దుర్గాప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు. తాజాగా ఆమె బీజేపీ అభ్యర్ధిగా రంగంలో దిగేందుకు పావులు కదుపుతున్నారు.

రావెల‌కు ద‌క్కునా?

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పని చేసిన రావెల కిషోర్ బాబు కొద్ది కాలం కిందటే బిజెపిలో చేరారు. ఆయన తిరుపతి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. తిరుపతి లోక్ సభ టిక్కెట్ తనకు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. కేంద్రంలో బిజెపి నాయకులతో ఎంతో సన్నిహితంగా మెలగుతున్న రావెల కిషోర్ బాబు తిరుపతి స్థానం తనకు కేటాయిస్తే గెలిచి వస్తానని ధీమాగా చెబుతున్నారు.

దాస‌రికి ద‌క్కేనా?

వీరిద్దరితో బాటు మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు కూడా రంగంలో ఉన్నారు. ఆయన తిరుపతి ప్రాంతంలో చాలా కాలంగా ధర్మ ప్రచార పరిషత్ తరపున పని చేస్తున్నారు. దాసరి శ్రీనివాసులు తనకు తిరుపతి స్థానం కేటాయించాలని చాలా కాలంగా కోరుతున్నారు. పార్టీకి ఇంత మంది అభ్యర్ధులు పోటీ పడటమే బిజెపి తొలి గెలుపుగా భావిస్తున్నారు.

Related posts

స్వామీ అయ్యప్పా ఈ వివాదాలు నిన్ను ఆపగలవా?

Satyam NEWS

క‌రోనా ఎఫెక్ట్: పైడితల్లి అమ్మ‌వారి పండుగ‌పై పోలీసు శాఖ ఆంక్ష‌లు….!

Satyam NEWS

రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీకి మరో సవాల్: ఈ సారి బీజేపీ రూపంలో…

Bhavani

Leave a Comment