28.7 C
Hyderabad
April 20, 2024 06: 16 AM
Slider ఆదిలాబాద్

ఇంద్రవెల్లి అమరులకు నివాళి అర్పించిన రేవంత్ రెడ్డి

#revanthreddy

తెలంగాణ లో ఇంకా ఆదివాసీలకు న్యాయం జరగడం లేదని పార్లమెంటు సభ్యుడు, టీ.పీ.సీ.సి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇంద్రవెల్లి ఘటన జరిగి 40 సంవత్సరాలయిన సందర్భంగా నేడు ఆయన ఆదిలాబాద్  జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరుల స్థూపం వద్ద ఆయన నివాళి అర్పించారు.

ఆదివాసీలు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడం, తాము వ్యవసాయం చేస్తున్న భూములకు పట్టాలు లేకపోవడం ప్రధాన సమస్యగా రేవంత్ రెడ్డి చెప్పారు. విద్యా, వైద్యం, రవాణా సౌకర్యాల కోసం ఇప్పటికీ ఆదివాసీలు ఉద్యమిస్తున్నారని ఆయన అన్నారు.

అడవులలో ఉన్నవారిని మైదాన ప్రాంతాల్లోకి తీసుకువచ్చేoదుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు ఈ స్థూపం వద్దకు టీఆర్ఎస్ నాయకులు వచ్చారు కానీ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎవరూ రాలేదని రేవంత్ రెడ్డి అన్నారు.

ఇంద్రవెల్లిలో అమరులైన  కుటుంబాలకు ఇప్పటికైనా 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే  ఇదే స్థూపం వద్ద కు వచ్చి ఇక్కడే మహాపంచాయతి నిర్వహించి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువస్తానని యం.పి.రేవంత్ రెడ్డి అన్నారు.

అమరవీరులకు  నివాళులు అర్పించడానికి ఆదిలాబాద్  జిల్లా కి  విచ్చేసిన ఎం.పీ కి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ శాలువా కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏ.ఐ.సి.సి.మెంబర్ గండ్రత్ సుజాత, కొండా గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

భారత ఇస్రో టీంకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపిన విద్యార్థులు

Bhavani

కేంద్ర సర్వీసులోకి గిరిజన బిడ్డ జానకి

Satyam NEWS

హుజూర్ నగర్ అపూర్వ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Satyam NEWS

Leave a Comment