36.2 C
Hyderabad
April 18, 2024 11: 04 AM
Slider తెలంగాణ

పోలీసుల కళ్లు గప్పి బుల్లెట్ పై దూసుకు వచ్చి

revanth23

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన చలో ప్రగతి భవన్‌ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. చలో ప్రగతి భవన్ కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు ఎక్కడి అక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. మరికొందరు నేతలను హౌస్‌ అరెస్ట్‌లు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ పార్టమెంటు సభ్యుడు, ఫైర్‌ బ్రాండ్‌ రేవంత్‌ రెడ్డి మాత్రం పోలీసులను బురిడి కొట్టించారు. పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేసినప్పటికీ వారిని తోసుకుంటూ ఇంటి బయటకు వచ్చారు. అక్కడి నుంచి వేగంగా ముందుకు సాగిన రేవంత్‌.. అక్కడి నుంచి బైక్‌పై వెళ్లిపోయాడు. అక్కడి నుంచి నేరుగా ప్రగతి భవన్‌ వద్దకు చేరుకున్నారు. బైక్‌పై దూసుకొచ్చిన రేవంత్‌ను ప్రగతి భవన్‌ సమీపంలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో ప్రగతిభవన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్‌ వెంటనే చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. పరిస్థితులు కొనసాగితే.. తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజలు ప్రగతి భవన్‌ గోడలు బద్దలు కొట్టడం ఖాయమని అన్నారు. ప్రగతి భవన్‌ గేట్లను తాకుతామని అన్నామని.. తాకి చూపించామని చెప్పారు. రేవంత్ రెడ్డి కోసం పోలీసుల వేట నిన్న రాత్రి నుంచే సాగింది ఇంట్లో లేని రేవంత్ రెడ్డి కోసం ప్రగతి భవన్ చుట్టూ ఉన్న అన్ని హోటల్స్ ను పోలీసులు చెక్ చేశారు. రేవంత్ అనుచరుల ఇళ్లలోనూ చెక్ చేసిన పోలీసులకు ఆయన ఆచూకీ దొరకలేదు. చివరకు రేవంత్ రెడ్డి ని పోలీసులు ప్రగతిభవన్ వద్ద అరెస్టు చేయగలిగారు.

Related posts

బియ్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి సిర్పూర్ ఎమ్మెల్యే

Satyam NEWS

వివాహిత చేతిలో మోసపోయిన యువకుడు

Satyam NEWS

స్వామి వారి కళ్యాణం ఏర్పాట్లు

Murali Krishna

Leave a Comment