Slider ఆదిలాబాద్

జిల్లా అభివృద్ధికి నా వంతు సాయం చేస్తా

soyam

పార్లమెంటు సభ్యుడు సోయం బాపూరావు నేడు నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. సమస్యల పరిష్కారం కోసం అన్ని విధాలా ప్రయత్నిస్తానని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు. జిల్లా అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నారనని ఎంపి వెల్లడించారు.

ఫిర్యాదులు స్వీకరించే ఈ కార్యక్రమంలో ఎంపి సోయం బాపురావు తో బాటు జిల్లా బిజెపి అధ్యక్షురాలు పడకంటి రమాదేవి, కేంద్ర విత్తన పాలక మండలి సభ్యులు అయ్యన్నగారి భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

అంతే కాకుండా రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యుడు ఒడిసెల శ్రీనివాస్, జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు అంజూకుమార్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సామ రాజేశ్వర్ రెడ్డి, బిజెపి దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్, బిజెవైఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ రెడ్డి ,పట్టణ అధ్యక్షుడు అయ్యన్నగారి రాజేందర్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కార్యకర్తలు తదితరులు కూడా పాల్గొన్నారు.

Related posts

అవినీతి, కుటుంబ పాలన ఎంతో కాలం ఉండదు

Satyam NEWS

A Question: ఇవన్నీ కాస్ట్లీ కరోనా కేసులు గురూ

Satyam NEWS

హైదరాబాద్ లో ఎలక్ట్రిక్‌ గ్రీన్‌ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!