Slider మెదక్

ఉపాధి పనులపై శ్రద్ధ చూపని ఎంపిడివోపై వేటు

#MPDO Dubbaka

ఉపాధి హామీ పనులను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించినందుకు దుబ్బాక MPDO వేలేటి భాస్కర శర్మ ను సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామా రెడ్డి సస్పెండ్ చేశారు. రాష్ట్రంలో కరోనావైరస్ ప్రభావం ఉన్నప్పటికీ గ్రామీణ హామీ పథకాన్ని అమలుచేయాలని చెబుతూ అందుకు లాక్ డౌన్ మినహాయింపులు ఇచ్చారు.

సామాజిక దూరం పాటిస్తూ కూలీలకు పనులు కల్పించాలని ఆదేశాలు ఉన్నాయి. దుబ్బాకలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు అయిన కూలీల సంఖ్య 17 వేలకు పైగా ఉంది. ఇంత పెద్ద మొత్తంలో కూలీలు ఉన్నందున భారీ ఎత్తున పనులు చేపట్టేందుకు అవకాశం ఉంది.

ప్రస్తుత క్లిష్ట సమయంలో ఎంత వీలైతే అంత ఎక్కువ మందికి పని కల్పించాలని ప్రభుత్వం సూచించినా ఆయన పట్టించుకోలేదు. దాంతో భాస్కర శర్మ ను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. అదేవిధంగా కోహెడ ఎంపీడీఓ శ్రీధర్ కు ఛార్జ్ మెమో జారీ చేసిన జిల్లా కలెక్టర్ వెంకట్రామా రెడ్డి తెలిపారు.

Related posts

ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా టీఆరెస్ పార్టీ

Satyam NEWS

రెజర్లకు మద్దతుగా సంతకాల సేకరణ

mamatha

20న హైదరాబాద్ వస్తున్న మోటివేషనల్ స్పీకర్ రాజ్ దీదీ

Satyam NEWS

Leave a Comment