32.2 C
Hyderabad
April 20, 2024 22: 00 PM
Slider కృష్ణ

ఏపీ అగ్రికల్చర్ MPEO ల రెన్యువల్ జివో వెంటనే విడుదల చెయ్యాలి

#agriculture

ఆంధ్రప్రదేశ్ లో MPEO లకు గత నాలుగు నెలల నుండి జీతాలు రావడంలేదని MPEO స్టేట్ సభ్యులు ఆరోపించారు. సాంకేతిక బహుళ ప్రయోజన విస్తరణ అధికారుల రాష్ట్ర అసోసియేషన్ సమావేశం ఆదివారం నాడు విజయవాడ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ భవనంలో జరిగింది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అ 13 జిల్లాల నుంచి బహుళ ప్రయోజన విస్తరణ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి వి వేణుమాధవ్, రాష్ట్ర  ట్రెజరీ షేక్ సుభాని హాజరు అయ్యారు. ఈ సందర్భంగా MPEO స్టేట్ సభ్యులు మాట్లాడుతూ నాలుగు నెలల నుండి జీతాలు రావడంలేదని, దానికి సంబంధించిన రెన్యువల్ జివో  రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేసి జీతాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు.

ఒక జాబ్ చార్ట్ చేసి  ఉద్యోగ భద్రత కల్పించాలని వారు అన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డివి వేణుమాధవ్ మాట్లాడుతూ సమస్యలను వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 13 జిల్లాల అసోసియేషన్ సభ్యులు ఎస్ కే భాష, కె నారాయణ, శశి కుమార్,  ఫణికుమార్, శరత్ ఇతర అ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

వాహనాల నిర్వహణ పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి

Satyam NEWS

ఆటో డ్రైవరు నిజాయితీతో బాధితులకు చేరిన బ్యాగులు

Satyam NEWS

నరసరావుపేటలో వైభవంగా కొప్పరపు కవుల విగ్రహ ప్రతిష్ఠ

Satyam NEWS

Leave a Comment