ఆఫ్రికాలో గత వారంలో దాదాపు 4,000 mpox కేసులు నమోదవుతున్నాయి. mpox కేసుల లో ఈ వారం అత్యంత భారీ పెరుగుదల కనిపిస్తున్నది. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న వ్యాక్సిన్ కూడా ఈ ప్రభావిత దేశానికి ఇప్పటికి అందలేదు. గత వారంలో ఆఫ్రికాలో mpox కారణంగా ఎనభై ఒక్క మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు, మరణాలు వరుసగా 22,863, 622కి చేరుకున్నాయని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ హెడ్ డాక్టర్ జీన్ కసేయా ఆన్‌లైన్ బ్రీఫింగ్‌లో తెలిపారు.
యూరోపియన్ యూనియన్ మరియు యునైటెడ్ స్టేట్స్ వంటి పాశ్చాత్య భాగస్వాములు దాదాపు 380,000 డోసుల mpox వ్యాక్సిన్‌లను వాగ్దానం చేశాయని ఆయన చెప్పారు. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీకి కేంద్రంగా ఉన్న కాంగోలో పాక్స్ వ్యాప్తిని అంతం చేయడానికి అధికారులు చెప్పిన మోతాదులలో ఇది 15% కంటే తక్కువ. అయితే అది కూడా ఇప్పటి వరకూ అందలేదు. అందుకోసం తమ అభ్యర్థనను పునరావృతం చేసినట్లు ప్రజారోగ్య సంస్థ తెలిపింది.