32.2 C
Hyderabad
March 29, 2024 00: 22 AM
Slider ప్రత్యేకం

పార్లమెంటు సభ్యులకు ఇక ఆ సౌకర్యం కట్

#parlament

ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణ  ప్రక్రియ మొదలుకావడంతో ఎంపీలకు ఉచిత విమాన టికెట్లు బంద్‌ అయ్యాయి. ఇప్పటివరకు ఎయిర్‌ ఇండియా ప్రభుత్వరంగ సంస్థగా ఉండటం వల్ల ఎంపీలకు ప్రొటోకాల్‌ అమలు చేసేవారు. ఇకమీదట ఆ సదుపాయం ఉండదు. ఎంపీలు డబ్బు పెట్టి విమాన టికెట్లు కొనాలని శుక్రవారం విడుదలైన రాజ్యసభ సచివాలయ బులెటిన్‌ సభ్యులకు సూచించింది.

పార్లమెంటు సభ్యులకు వ్యక్తిగతంగా  34 విమాన టికెట్లు, వారి జీవిత భాగస్వామికి మరో 8 టికెట్లు గతంలో ఉచితంగా ఇచ్చేవారు. వాటి కొనుగోలుకు పార్లమెంటు ఉభయసభల సచివాలయాలు ‘ఎక్స్ఛేంజ్‌ ఆర్డర్‌’ జారీ చేసేవి. ఆ ఉత్తర్వులు చూపి డబ్బు పెట్టకుండానే ఎంపీలు ఎయిర్‌ ఇండియా టికెట్లు కొనుగోలు చేయడానికి వీలుండేది. ఇప్పుడు ఆ విధానాన్ని రద్దు చేశారు. రాజ్యసభ, లోక్‌సభ సచివాలయాలు ఇప్పటికే జారీ చేసిన ఎక్స్ఛేంజ్‌ ఆర్డర్లను అనుసరించి టికెట్లు కొని ఉంటే అందుకు సంబంధించిన టీఏ క్లెయిమ్‌లు చేసుకోవచ్చు.

Related posts

తిమ్మప్ప స్వామికి సాలగ్రామ హారం బహూకరణ

Satyam NEWS

కొల్లాపూర్ ప్రాంత కృష్ణానది పడవ యజమానులకు పోలీస్ హెచ్చరిక

Satyam NEWS

నిత్యాన్నదాన సత్రాలపరిపాలనా కార్యాలయం ప్రారంభం

Bhavani

Leave a Comment