36.2 C
Hyderabad
April 25, 2024 22: 06 PM
Slider నల్గొండ

ప్రయివేటు యూనివర్సిటీలలో రిజర్వేషన్ అమలు చేయాలి

#MRPSSuryapet

ప్రయివేటు యూనివర్సిటీలలో రిజర్వేషన్ అమలు చేయాలని, వెంటనే ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలలను ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) డిమాండ్ చేసింది.

సోమవారం హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి వస్కుల జయరాజు మాదిగ అధ్యక్షతన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రహదారి బంగ్లాలో సమావేశం జరిగింది.

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సమావేశానికి MRPS రాష్ట్ర కార్యదర్శి రావూరి విజయభాస్కర్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈనెల 6వ,తేదీ నుండి 13వ,తేదీ వరకు జరిగే కార్యక్రమ వివరాల కరపత్రాన్ని విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రయివేటు యూనివర్సిటీలలో రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈనెల 6వ, తేదీన మండల కేంద్రము లోని మండల విద్యాశాఖాధికారికి,7వ, తేదీన జిల్లా విద్యాశాఖాధికారి కి,8న, నియోజకవర్గ కేంద్రంలోని శాసనసభ్యుడికి, వినతి పత్రాలు సమర్పించాలని ఆయన కోరారు.

9,10 తేదీలలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాలని అన్నారు. 13వ తేదీన హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించాలని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో MRPS రాష్ట్ర కార్యదర్శి క్రిష్ణబాబు మాదిగ, రాష్ట్ర సహాయక కార్యదర్శి కడప పెంటారావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు గుండెపంగు పద్మ,

జిల్లా సహాయక కార్యదర్శి పిడపర్తి వెంకటనారాయణ,సూరి,రెడపంగు నాగరాజు,కాశయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related posts

సేవారత్న నేషనల్ అవార్డుకు ఎంపికైన రత్నకుమారి

Bhavani

గద్దర్ అన్నకి నివాళి

Satyam NEWS

కృష్ణా రెడ్డి నగర్ కాలనీ లో విస్తృత పర్యటన

Satyam NEWS

Leave a Comment