ఆర్టీసీ కార్మికుల సమస్యలకు సంఘీభావం తెలిపిన ఎంఆర్ పిఎస్ నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ అంబర్ పేట్ లో ఎం ఆర్ పి ఎస్ నాయకులు ఎం ఆర్ వో కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎం ఆర్ పి ఎస్ జాతీయ నాయకులు ఎడవేల్లి యాదయ్య మాదిగ, రాష్ట్ర నాయకులు బడుగుల బాలకృష్ణ మాదిగ, జిల్లానాయకులు ఈటా దర్శన్, రమేష్, ప్రసాద్, అరవింద్, ఆంజనేయులు, దాస్, కేశవ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే పరిష్కరించాలని ఎం ఆర్ పి ఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ ఇప్పటికే డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
previous post