27.7 C
Hyderabad
April 24, 2024 07: 11 AM
Slider పశ్చిమగోదావరి

ఏలూరులో ఘనంగా ఎమ్మార్పీయస్ ఆవిర్భావ దినోత్సవం

#mrps

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 27వ ఆవిర్భావ దినోత్సవం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కండ్రిక గూడెం సెంటర్లో ఘనంగా నిర్వహించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ జన్మదిన ఉత్సవాలు కూడా ఈ సందర్భంగా నిర్వహించారు.

ముందుగా ఎమ్మార్పీఎస్ జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి పేద ప్రజలకు 300 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వితంతువులకు 100 మందికి చీరలు పంపిణీ చేశారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కందుల రమేష ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా కందుల రమేష్ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామములో 20 మందితో ఎమ్మార్పీఎస్ ప్రారంభమైందని తెలిపారు. ఈరోజు లక్షలాదిమంది ఎమ్మార్పీఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి లక్షలాది మందితో ఎమ్మార్పీఎస్ నిర్మించబడిందని ఆయన అన్నారు.

నిర్మాణంలో ఎన్నో ఉద్యమాలు చేసి  ఆర్థిక అసమానతలు రాజకీయ సమానత్వం సమాజ సమానత్వం కోసం మాదిగలు ఎంతో మంది అమరులయ్యారని ఆయన తెలిపారు. మందకృష్ణ మాదిగ అలుపెరగని పోరాటం చేశారని ఆయన తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తక్షణమే రాజ్యాంగ సవరణ చేసి ఎస్సీ లో ఉండే 59 కులాలకు అట్టడుగున కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏలూరు ఎమ్మార్పీఎస్ పార్టీ ప్రెసిడెంట్ గూడూరి రాజేష్ రెల్లి తో బాటు ఏలూరు అధ్యక్షులు అర్జీ సురేష్ మండల నాయకులు కొమ్ము జాన్ మైనార్టీ నాయకులు షేక్ బాజీ తంగెళ్ళమూడి శానిటైజర్ ఇన్స్పెక్టర్ దొండపాటి నాని  కందుల రమేష్ బీసీ నాయకులు వల్లూరి  వెంకన్న రాచేటి రవి రాచేటి కిషోర్ భీమడోలు చిన్న గ్రామ పెద్దలు బొగ్గు శ్రీను కొత్తపల్లి ప్రసాద్ కొత్తపల్లి బుజ్జి కందుల రాజు తాడిగడప నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

యాదాద్రికి కేజీ బంగారం విరాళం ప్రకటించిన ఎన్ఆర్ఐ ఫైళ్ళ మల్లారెడ్డి

Satyam NEWS

కొల్లాపూర్ ప్రాంతంలో పెద్దఎత్తున నల్లబెల్లం స్వాధీనం

Satyam NEWS

కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరిన నాయకులు

Satyam NEWS

Leave a Comment