మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్‌కి గురువారమే రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా..? ఈ విషయాన్ని కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా ఈరోజు తెలియజేశాడా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటించేస్తాడని అంతా ఊహించారు. కానీ.. మిన్నకుండిపోయిన ఈ మాజీ కెప్టెన్ ఈరోజు రాత్రి 7 గంటలకి మీడియాతో మాట్లాడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ధోనీతో తనకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తాజాగా విరాట్ కోహ్లీ ఓ ట్వీట్ చేశాడు. దీంతో.. ధోనీ రిటైర్మెంట్ దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ట్వీట్‌తో రిటైర్మెంట్ వార్తలకి బలం చేకూరింది.
next post