39.2 C
Hyderabad
March 29, 2024 15: 51 PM
Slider మెదక్

ముదిరాజులను అణచివేస్తున్న తెలంగాణ ప్రభుత్వం

#mudiraj

కొత్తగా ఏర్పడ్డ బి.సి కమిషన్ ద్వారానైనా ముదిరాజుల స్థితి గతులపైన ముసాయిదా సుప్రీంకోర్టుకు ఇచ్చి ముదిరాజ్ లను బి.సి ఏ లోకి చేర్చడాని తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడతారా లేదా అని ముదిరాజ్ మత్య్సకారుల సంక్షేమా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మెదక్ జిల్లా చిన్నకోడూర్ మండలం మాచాపూర్ గ్రామంలో మండల  అధ్యక్షుడు తుమ్మల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఎన్నికల సమావేశంలో టీ.ఆర్.యం.ఎస్ మండల ప్రధాన కార్యదర్శిగా యాట రఘు, యూత్ ఉపాధ్యక్షునిగా రేగుల స్వామి లని నియమించిన సందర్భంగా జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడారు. రిజర్వేషన్లు లేక ఉద్యోగాలు లేక ఉపాధి లేక ముదిరాజులు ఆర్థికంగా అభివృద్ధి చెందడం లేదని ఆదుకోవాల్సిన ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదని గత ప్రభుత్వంలో ముదిరాజులను బీసీ డి నుండి బి సి ఏ లోకి చేరుస్తూ జీవో  15 జారీ చేస్తే ఓర్వలేని కొంతమంది హైకోర్టును ఆశ్రయించి మా జీవోను నిలిపివేశారని దానిద్వారా నన్నా తమకు న్యాయం జరుగుతుంది అనుకుంటే ఇప్పటికీ ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ పడిందని అన్నారు.

ముదిరాజుల స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతే గతంలోని బీసీ కమిషన్ చైర్మన్ రాములు ద్వారా అధ్యయనం చేయించి పక్కన పెట్టారని ఇప్పుడైనా కొత్త కమిషన్ ద్వారా ఆ ముసాయిదా సుప్రీంకోర్టుకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

రాష్ట్రంలో వర్షాలు పడి చెరువులు కుంటలు నిండితే తద్వారా చేప పిల్లలు పోసి పెంచుకుందామని అనుకుంటే కొంతమంది కావాలని చెరువుకట్ట కు గండి పెడుతున్నారని చిన్న చిన్న కుండీలలో మట్టి నింపి కబ్జాలు చేస్తున్నారని వద్దు అని అడుగుతే మత్స్యకారులను దాడులు చేసి కొడుతున్నారని అలంటి వారి పైన కఠిన చర్యలు తీసుకొని ముదిరాజులకు న్యాయం చేయాలని అన్నారు.

టీ.ఆర్.యం.ఎస్ రాష్ట్ర కార్యదర్శి కొమురవెళ్ళి నర్సింహులు మాట్లాడుతూ ముదిరాజులకు విద్య లేకపోవడం వల్ల ఆర్థికంగా వెనకపడ్డమని ఇప్పటికైనా మన పిల్లలకు చదువు నేర్పే ఉన్నత స్థానంలో నిలిపితే భవిష్యత్తు బాగుపడుతుందని అన్నారు.

ఒకే సొసైటీలో పది పదిహేను గ్రామాలు విలీనమై ఉన్నాయని అలంటి వాటిని విముక్తి చేసి ఆయ గ్రామ పంచాయితీలో ఉన్న మత్య్సకారులకు నూతన సొసైటీ చేయాలనీ రాష్ట్రంలో పద్దెనమిది సంవత్సరంలు నిండిన ప్రతి ఒక్క మత్య్సకారుడికి సభ్యత్వం ఇవ్వాలని ప్రభుత్వన్ని కోరారు.

ఈ సమావేశంలో సోషల్ మీడియా జిల్లా ఇంచార్జ్ కోరమేన యాదగిరి, కొండపాక మండల అధ్యక్షుడు అంక్కుస్, కన్వీనర్ రమేష్, నారాయణరావు పేట అధ్యక్షుడు బోయిని కమలాకర్,  నాయకులు మండల యూత్ కార్యదర్శి హరీష్, బాబు, బాలేష్, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related posts

సోమేష్ కుమార్ కు తెలంగాణ హైకోర్టు వారంట్

Bhavani

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన బిగ్ బాస్ రాహుల్

Satyam NEWS

పాపకు పట్టీలు కొనేందుకు వెళ్లి.. మృత్యువడిలోకి…

Satyam NEWS

Leave a Comment