32.2 C
Hyderabad
April 20, 2024 20: 19 PM
Slider మెదక్

నవంబర్ 21న ముదిరాజ్ జండాపండుగ వాల్ పోస్టర్ ఆవిష్కరణ!

#mudiraj

ముదిరాజులు ఏకమైతే హక్కులు సాదించుకోవచ్చని మత్య్సశాఖ అధ్యయన కమిటీ సభ్యులు తుపాకుల బాల్ రంగం ముదిరాజ్ అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ పెద్దమ్మ దేవస్థానంలో ముదిరాజ్ జండాపండుగ వాల్ పోస్టర్ ను మత్య్సకారుల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, యూత్ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు యామ ధర్మ ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షులు మేడికాయల వెంకటేశం, ముదిరాజ్ ప్రతినిధి కీసరి పాపయ్య లతో కలసి బాల్ రంగం ముదిరాజ్ వాల్ పోస్టర్ విడుదల చేసి మాట్లాడారు.

తతరాలుగా ముదిరాజులు వెనక పడిపోతున్నారని మనం ఐక్యతతో ఉంట్టే ఎన్నో హక్కులు సాదించ్చుకోవచని ముదిరాజ్ లను ఏకం చేయడానికే తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 21న ముదిరాజ్ జండాపండు కార్యక్రమాన్ని చేపట్టామని రాష్ట్రంలోని అన్ని ముదిరాజ్ సంఘాల వద్ద జండా ఎగరవేసి ముదిరాజ్ జాతి ఐక్యతను చటాలని అప్పుడే ముదిరాజ్ కార్పొరేషన్ కానీ బిసి “ఏ” మారడం కానీ సాధ్యపడుతుందని అన్నారు.

తప్పకుండా ప్రతి ముదిరాజ్ బిడ్డ ఈ జండాపండుగ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ముదిరాజ్ మహాసభ ప్రతినిధులు ఇట్టబోయిన శ్రీనివాస్, గ్రామ అధ్యక్షుడు చింతకింది ప్రభాకర్, ఇట్టబోయిన బాలపోషయ్య, మాజీ అధ్యక్షుడు చెరుకు పెద్దలు, సర్పంచులు మద్దికుంట నవీన్, గాడిచర్ల బాలయ్య, కొత్త శంకర్, నాయకులు ఉప్పరమేన దేవయ్య, చెరుకు శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

Related posts

కనీసం బొగ్గు నిల్వల్లో వాటా కూడా ఏపికి ఇవ్వలేదు

Satyam NEWS

Free Sample _ List Of All Prescription Weight Loss Pills T5 Fat Burning Pills Reviews

Bhavani

బ్యాంకులు ప్రయివేటీకరణ చేస్తే పొదుపుకు ముప్పు

Satyam NEWS

Leave a Comment