22.2 C
Hyderabad
December 10, 2024 09: 42 AM
Slider ఆధ్యాత్మికం

గోదావరి పుష్కరాల ముహూర్తం ఖరారు

#rivergodavari

కోట్లాది మంది పవిత్రంగా భావించే గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. దేశ విదేశాల నుంచి గోదావరి పుష్కరాలకు తరలి రానున్నారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తం అయింది. ముందస్తు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. చేపట్టాల్సిన పనులపైన నిర్ణయానికి వచ్చారు. ఈ సారి గోదావరి పుష్కరాల నిర్వహణలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తాజాగా పుష్కరాల నిర్వహణ కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణకు నిర్ణయించారు.

ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కరాల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు మొదలు పెట్టింది. ఈ సారి పుష్కరాల కోసం 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో ప్రతిపాదనలు అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. సుమారు రెండున్నరేళ్ల కంటే ఎక్కువ సమయం ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటి నుంచే రంగంలోకి దిగారు. పుష్కర ఏర్పాట్ల పైన కీలక కసరత్తు చేశారు. అందరూ ఒకే ఘాట్‌లో స్నానాలు చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయవచ్చని ప్రచారం చేయనున్నారు.

ప్రస్తుతం ఉన్న 17 ఘాట్లకు రోజుకు 75,11,616 మంది వస్తారని అంచనా వేశారు. మరో నాలుగు కొత్త ఘాట్లు అవసరమని భావిస్తున్నారు. యాత్రికుల బస ఏర్పాట్లపై చర్చించారు. రాజమహేంద్రవరం పరిధిలో గోదావరి ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో బడ్జెట్‌ ప్రతిపాదించారు. కార్పొరేషన్‌ రోడ్ల అభివృద్ధికి రూ.456.5 కోట్లు, ఆర్‌అండ్‌బీ రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి రూ.678.76 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. సిటీ బ్యూటిషికేషన్‌, ఐకానిక్‌ టూరిజం సైట్‌ ప్రాజెక్టు కోసం రూ.75 కోట్లతో ప్రతిపాదించారు.

Related posts

ఎదురుదాడికి ప్రత్యేక వ్యూహం

Murali Krishna

హైదరాబాద్ లో తొలి స్వలింగ సంపర్కుల వివాహం

Satyam NEWS

అతి పవిత్రుడు సంగాం అగ్రహార సంగమేశ్వరుడు

Satyam NEWS

Leave a Comment