28.7 C
Hyderabad
April 17, 2024 03: 07 AM
Slider జాతీయం

ఆదాయం ఉన్న భార్య నుంచి భర్తకు పరిహారం

#marriage

మాకేం తక్కువ మేం కూడా అన్ని రంగాల్లో మగవారితో పోటీ పడతాం అనే మహిళలకు ఇప్పుడు గట్టి చిక్కే వచ్చిపడింది. వేరుగా ఉంటున్న తన భార్య నుంచి తనకు పరిహారం ఇప్పించాలని ఒక భర్త కోరడంతో ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లా కోర్టు తగిన ఆదేశాలు ఇచ్చింది.

ఒక మహిళ తన భర్త నుంచి చాలా కాలంగా వేరుగా ఉంటున్నది. ఆమె ప్రభుత్వ ఉద్యోగి కాగా తనకు వేరే సంపాదన లేదని అందువల్ల తనకు నెలవారీ ఖర్చులు ఇప్పించాలని ఆమె భర్త 2013లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

కేసు పూర్వాపరాలు విచారించిన తర్వాత 1955 హిందూ వివాహ చట్టం ప్రకారం ఆధారం లేని జీవిత భాగస్వామికి మెయింటెనెన్సు ఇవ్వాలని ఉందని అందువల్ల స్థిర ఆదాయం ఉన్న భార్య తన భర్తకు నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వాలని కోర్టు ఆదేశాలిచ్చింది.

ఆమె కు నెలకు 12 వేల రూపాయలు పెన్షన్ వస్తుంది.

Related posts

వి లవ్ సినిమా: సరికొత్త నిర్మాణ సంస్థ చాహత్ ప్రొడక్షన్స్

Satyam NEWS

రాజ్ ఘాట్ వద్ద టిడిపి ఎంపిల మౌనదీక్ష

Satyam NEWS

బోటు ట్రాజెడీ మృతుని కుటుంబానికి పరిహారం

Satyam NEWS

Leave a Comment