గత కొన్నేళ్లుగా అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలకు నిస్వార్థంగా సేవలందిస్తున్న ముక్కా ఫౌండేషన్ మరోసారి తమ దాతృత్వ గుణాన్ని చాటుకుంది. ఓ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం ఏ పని చేయలేక ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న ఓ దళిత వ్యక్తి కుటుంబానికి ఆర్ధికంగా అండగా నిలబడి ఆదుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..రైల్వే కొడూరు మండలం, శెట్టిగుంట మండలం, శెట్టిగుంట హరిజన వాడ గ్రామంలో ఇటీవల రేవూరి మహేష్ అనే వ్యక్తి యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడి ఇంటిదగ్గరే కోలుకుంటున్నాడు. ప్రస్తుతం ఏ పని చేయలేకపోవడంతో అతడి కుటుంబం రోజువారీ తిండి ఖర్చులకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతోంది.. ఈ విషయం తెలుసుకున్న కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మరియు రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి పార్టీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మీ చలించిపోయారు. ఈ మేరకు మంగళవారం ఆరోగ్య, యోగ క్షేమాలు కనుకున్నారు. బాధితుడి కుటుంబానికి ధైర్యం చెప్పారు. తక్షణ ఆర్ధిక సాయంగా ముక్కా ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా రూ.25,000/- చెక్కు అందించారు.అలాగే మున్ముందు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు. కష్టకాలంలో అండగా నిలిచి, ఆదుకున్న ముక్కా వరలక్ష్మీ మహేష్ కుటుంబం ధన్యవాదాలు తెలిపారు.ముక్కా ఫౌండేషన్ సేవానిరతిపై స్థానిక ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
previous post