39.2 C
Hyderabad
March 29, 2024 16: 32 PM
Slider మహబూబ్ నగర్

గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూముల జోలికొస్తే ఊరుకోం

#madiga

గిరిజన బిడ్డలు సాగు చేసుకుంటున్న భూములపై అక్రమంగా ఫారెస్ట్ అధికారులు దాడులు చేయడం, దారుణంగా వాళ్ళని హింస పెడుతూ, వారిని ఇష్టమొచ్చినట్టు కొట్టడం అన్యాయమని తెలంగాణ మాదిగ దండోరా నాగర్ కర్నూలు జిల్లా కమిటీ తెలిపింది.

ఒక గిరిజన యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసినా ఫారెస్ట్ అధికారులు కనికరించుకపోవడం దురదృష్టకమైన చర్య అని తెలంగాణ మాదిగ దండోరా జిల్లా అధ్యక్షులు డికే.మాదిగ, తాలూకా అధ్యక్షులు మల్లెల వెంకటస్వామి మాదిగ అన్నారు.

ప్రభుత్వ భూమి అంటే, అది ప్రజల భూమి. ఆ భూమిని దున్నుకోవడానికి ప్రజలకి హక్కు ఉంటుంది. దున్నేవాడిదే భూమి, ఆ భూమి ఎవడబ్బ సొమ్ము కాదు అని వారు అన్నారు. ముక్కిడిగుండం తండవాసులు గత 20 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములపై ఫారెస్ట్ అధికారుల కన్ను పడడం దురదృష్టకరమని వారు తెలిపారు.

ఈ విషయంపై కొల్లాపూర్ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి వెంటనే స్పందించి, ముక్కిడి గుండం గ్రామ గిరిజనులకు న్యాయం చేసి వాళ్ళు సాగు చేసుకుంటున్న పోడు భూములకు శాశ్వత పట్టాలివ్వాలని తెలంగాణ మాదిగ దండోరా డిమాండ్ చేసింది.

Related posts

సిఎం జగన్ అభీష్టానికి అనుగుణంగానే బోస్టన్ నివేదిక

Satyam NEWS

ప్లీజ్ సేవ్: జీవో 4 7 7 9 రద్దు చేయాలని వినతి

Satyam NEWS

బీజేపీ జనసేన మధ్య ముగిసిన పొత్తు?

Satyam NEWS

Leave a Comment