35.2 C
Hyderabad
April 20, 2024 15: 32 PM
Slider వరంగల్

కరోనా నుంచి ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసమే లాక్ డౌన్

#mulugupolice

లాక్డౌన్ ను పటిష్టంగా అమలు చేయాలని, విధుల నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలని ములుగు ఏ ఎస్ పి పోతరాజు సాయి చైతన్య అన్నారు.

నేడు ఆయన ములుగు జిల్లా కేంద్రంలో లాక్ డౌన్ తీరును పరిశీలించారు.

స్థానికంగా జీవనం సాగించే కూరగాయల వ్యాపారులతో మాట్లాడుతూ వారి సాధకబాధకాలు తెలుసుకొని ఈ విపత్కర పరిస్థితులు కొన్ని రోజులే ఉంటాయని భరోసా ఇచ్చారు.

కరోనా వ్యాధి శాశ్వతంగా వెళ్ళిపోయే వరకు ప్రజలందరూ ప్రభుత్వ నియమాలు పాటించి సహకరించాలని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ తరుణంలో ప్రజల ఆరోగ్యం రక్షణ కోసం ప్రభుత్వం లాక్డౌన్ ఏర్పాటు చేసిందన్నారు.

ప్రజలు అనవసరంగా రోడ్లపై కి రావొద్దు అని ఈ సందర్భంగా కోరారు. లాక్డౌన్ మినహాయింపు సమయంలో కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడాలని అనవసరంగా గుంపులుగా చేర వద్దు అని అన్నారు.

విధిగా మాస్కు ధరించాలన్నారు. గుంపులుగా చేరితే భౌతిక దూరం పాటించకపోవడం పై కేసు నమోదు చేస్తాం అన్నారు.

ఈ లాక్ డౌన్ పరిశీలన కార్యక్రమంలో ములుగు సిఐ గుంటి శ్రీధర్, ఎస్ ఐ ఓంకార్ యాదవ్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కొరకు అందరం కలిసి శ్రమిద్దాం

Satyam NEWS

చిత్తూరు జిల్లాలో వివాహిత దారుణ హత్య

Satyam NEWS

మూడేండ్ల‌లో నియామ‌కాలెన్ని ?

Sub Editor 2

Leave a Comment