37.2 C
Hyderabad
April 19, 2024 14: 22 PM
Slider వరంగల్

యునెస్కో గుర్తింపుపై ములుగు బిజెపి సంబురాలు

#mulugu bjp

రామప్ప కట్టడానికి యునెస్కో గుర్తింపు పొందిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై బాణసంచా పేల్చి సంబురం జరిపారు.

ఈ సందర్భంగా నగరపు రమేష్ మాట్లాడుతూ తెలంగాణలోని చారిత్రక దేవాలయమైన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా లభించడం హర్షదాయకం అని అన్నారు. యునెస్కో ద్వారా ఈ గుర్తింపు రావడం.. ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులు, సహాయ సహకారాలతోనే సాధ్యమైందని ఆయన అన్నారు. రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వసంపదగా గుర్తించేలా తోడ్పడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి కి, కేంద్ర సహాయ మంత్రి మీనాక్షి లేఖి కి ములుగు జిల్లా బీజేపీ తరుపున అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.

కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మొదటి బహుమతి ఇది అని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో ఇలాంటి మరెన్నో అవకాశాలు తెలంగాణకు కిషన్ రెడ్డి కల్పిస్తారని ఆశభావం వ్యక్తం చేసారు.

రామప్ప దేవాలయానికి ఇంతటి గొప్ప గుర్తింపు కోసం.. సభ్య దేశాలతో ఏకాభిప్రాయం సాధించడానికి మోదీ ఎంతో కృషి చేశారు. అందుకోసం వేగవంతమైన నిర్ణయాలను తీసుకొని సత్వర చర్యలను చేపట్టారు. అన్ని దేశాల ఏకాభిప్రాయంతోనే ఇది సాధ్యమైంది. తెలంగాణ చారిత్రక గొప్పతనాన్ని విశ్వవేదికపై నిలబెట్టిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదే అని అన్నారు.

రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం వల్ల తెలంగాణలో పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప ఖ్యాతి వస్తుందని ఆశభావం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి చిలమంతుల రవీంద్రచారి, అధికార ప్రతినిధి దొంతి రెడ్డి వాసుదేవ రెడ్డి, కార్యాలయ కార్యదర్శి చల్లూరి మహేందర్,బీజేపీ మండల అధ్యక్షులు ఇమ్మడి రాకేష్ యాదవ్,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు జీనుకల కృష్ణారావు,యువమోర్చ అధ్యక్షులు కొత్త సురేందర్, యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొంతిరెడ్డి రాకేష్ రెడ్డి,బీజేపీ మండల ఉపాధ్యక్షులు బైకని రాజశేఖర్,యువమోర్చ జిల్లా నాయకులు సానికొమ్ము హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

శబరిమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Satyam NEWS

నిరంతరం వీఆర్‌ఎస్‌ !

Satyam NEWS

ఏపీలో స్థానిక ఎన్నికల్లో ఎక్కడా గొడవలు జరగలేదు

Satyam NEWS

Leave a Comment