28.2 C
Hyderabad
April 20, 2024 11: 54 AM
Slider వరంగల్

సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న చోట బిజెపి బలంగా ఉంటుంది

#enugu rakesh reddy

రాబోయే రోజులలో ములుగు జిల్లాలో పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరు కృషి చేయాలని ములుగు జిల్లా బీజేపీ ఇంచార్జ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎనుగుల రాకేష్ రెడ్డి కోరారు.

భారతీయ జనతా పార్టీ ములుగు జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్స్ లో బీజేపీ జిల్లా అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ములుగు జిల్లా ఏర్పాటు జరిగాక బీజేపీ బలం రోజురోజుకి పెరుగుతుందని అన్నారు.

సంస్కృతి సంప్రదాయాలకు నిలయం ములుగు అని, సంస్కృతి సంప్రదాయాలు ఉన్న చోట భారతీయ జనతా పార్టీ పటిష్టం గా ఉంటుందని ఆయన అన్నారు.

సరైన నాయకత్వం లేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు ములుగు జిల్లాలో బీజేపీ అండగా వుండి పోరాటాలు చేయడానికి సిద్ధం గా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, జాతీయ స్థాయిలో నాయకత్వం లేని తలకాయ లేని పార్టీ కి తోక ఎక్కడ నుండి వస్తుందని ఏద్దేవా చేసారు.

రాష్ట్రం లో అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు అయినప్పటికీ ఉద్యమకారులకు ఆకాంక్షను తుంగలో తొక్కిన పార్టీ తెరాస పార్టీ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో  రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధి తాటి కృష్ణయ్య, జిల్లా సీనియర్ నాయకులు తక్కల్లపల్లి దేవేందర్ రావు,  సూరపనేని వెంకట సురేష్,  భూక్య రాజు నాయక్, జిల్లా పదాధికారులు నగర రమేష్,గాజుల కృష్ణ, అడప బిక్షపతి,

మందల విజయ్ కుమార్, ఏనుగు రవీందర్ రెడ్డి, కొండూరు నరేష్, శీలమంతుల రవీంద్రా చారి,పోడెం రవీందర్, కర్ర సాంబశివారెడ్డి, శివగాని స్వప్న,మేడిశెట్టి ఓంర, కార్యాలయ కార్యదర్శి చల్లూరి మహేందర్, మోర్చా అధ్యక్షులు కొత్త సురేందర్,

జీనుకల కృష్ణారావు, కావిరి అర్జున్, రాయికంటి పరమేశ్వర్, మహమ్మద్ యాకూబ్ పాషా, మండల అధ్యక్షులు భూక్య జహార్ లాల్, తేజ రాజ్, మల్లెల రాంబాబు, గండేపల్లి సత్యం, ఎర్రగాని వీరన్ కుమార్, కావేరి సంతోష్, మండల ప్రధాన కార్యదర్శి కోయిల కవిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

షబ్బీర్ అలీ భూములు బెదిరించి కబ్జా చేసినవి కాదు

Satyam NEWS

పెంచిన విద్యుత్‌ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి

Satyam NEWS

మిషన్ వాత్సల్య కోసం అనాధ బాలలు దరఖాస్తు చేసుకోవచ్చు

Bhavani

Leave a Comment