39.2 C
Hyderabad
March 28, 2024 16: 40 PM
Slider వరంగల్

విద్యార్థులకు న్యాయం చేయాలి

Students in Mulugu

ములుగు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న షటర్లను తొలగించాలని(ఎస్ఎఫ్ఐ) భారత విద్యార్థి సమైక్య (డివైఎఫ్ఐ) డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోసబ్ కలెక్టర్కు వినతి ప‌త్రం ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి సాగర్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కలువల రవీందర్ మాట్లాడుతూ ములుగు జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలంలో అక్రమంగా వేసుకున్న షట్టర్ లను వెంటనే తొలగించి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. అదేవిధంగా షట్టర్లు వేయించిన వ్యక్తులు అక్కడ షట్టర్ కు రూ. 50 వేలను అడ్వాన్స్ గా తీసుకొని నెలకు 6000, 7000 రూపాయలు తీసుకుంటున్నారని ఆరోపించారు.

కళాశాల యాజమాన్యం పలుమార్లు అధికారులకు ఈ విష‌యం చెప్పినప్పటికీ పట్టించుకోకపోవ‌డం శోచ‌నీయ‌మ‌న్నారు. కళాశాలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సెంటర్ ను తొలగించి పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయాలని కోరారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చ‌రించారు. ఈ కార్యక్రమంలో అనుముల రాజ్ కుమార్‌, శివ, మహేష్, రాజశేఖర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఈ నెల 10న 12వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయ‌ణం

Satyam NEWS

శ్రీకాకుళం జిల్లాలో కోటి రూపాయల గంజాయి పట్టివేత

Satyam NEWS

బోనులో చిక్కిన మరో చిరుత

Bhavani

Leave a Comment