28.7 C
Hyderabad
April 25, 2024 06: 30 AM
Slider వరంగల్

పల్లె ప్రకృతి వనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

#MuluguCollector

ములుగు జిల్లాలో పల్లె ప్రకృతి వనాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులతో పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పల్లె ప్రకృతి వనాలు ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమమని, ప్రతి ఆవాస ప్రాంతంలో ఏర్పాటుకు ప్రభుత్వ ఆదేశాలున్నాయని అన్నారు. జిల్లాలోని 390 ఆవాస ప్రాంతాల్లో పల్లె ప్రకృతి వనాలకు స్థలాలు గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు.

ప్రభుత్వ, అటవీ భూములను గుర్తించాలని, లేనిచోట గ్రామ పంచాయతీ నిధులతో ప్రయివేటు భూముల కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామ పంచాయతీ వద్ద కొనుగోలుకు నిధులు లేనిచోట, జిల్లా యంత్రాంగం ద్వారా నిధులు సమకూర్చుతామని ఆయన తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు వారానికి రెండు రోజులు తమ తమ మండలాల్లో పర్యటించి, వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు.

ఐసీడీఎస్ పోస్టులు భర్తీ చేయాలి

ఐసీడీఎస్ కు సంబంధించి ఖాళీ పోస్టుల నియామక ప్రక్రియ నియమ నిబంధనల మేరకు వెంటనే పూర్తి చేయాలన్నారు. సఖి, బాలసదనం, వృద్ధులు, అనాధాలకు ఒకే చోట భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.

 నీటిపారుదల శాఖకు కేటాయించిన స్థలంలో పోలీస్ స్టేషన్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు, నీటి పారుదల శాఖకు మరోచోట అనువైన స్థలాన్ని కేటాయించనున్నట్లు తెలిపారు. సహకార శాఖకు కేటాయించిన స్థలంలో మంచి భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ఈ భవనంలో జిల్లా పౌర సరఫరాల అధికారి, జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయాలు నిర్వహణకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

కార్యాలయాల ఫైళ్లు ఈ-ఆఫీస్ ద్వారా నిర్వహించాలని, ఇందుకై అధికారులకు, సిబ్బందికి శిక్షణ నిచ్చినట్లు ఆయన అన్నారు. కోవిడ్-19 దృష్ట్యా నియమించిన సిబ్బంది, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలు శాశ్వత సిబ్బంది వేతనాలు అందే ఫస్ట్ నే అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లాలోని పశు వైద్య కేంద్రాల్లో మరమ్మతులు ఉంటే వెంటనే చేయించాలని, పశువులకు వ్యాధులు వచ్చే అవకాశం ఈ సీజన్లో ఎక్కువగా ఉంటుందని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. 

జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు వ్యక్తిగత శ్రద్ధతో కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) ఆదర్శ్ సురభి, జిల్లా రెవిన్యూ అధికారిణి కె. రమాదేవి, డీఆర్డీవో ఏ. పారిజాతం, డీసీవో విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

ఇంకా, డిసిఎస్వో అరవింద్ రెడ్డి, ఇడి ఎస్సి కార్పొరేషన్ తుల రవి, సిపీవో ఐ. రవికుమార్, డిపివో వెంకయ్య, డిటివో జర్సన్ కుమార్, డిఇఓ డి. వాసంతి, డిడబ్లుఓ మల్లీశ్వరి, డిఎం&హెచ్ఓ డా. ఏ. అప్పయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కునూరు మహేందర్, సత్యం న్యూస్, ములుగు

Related posts

శార్వానంద్, రష్మిక చిత్రం షూటింగ్ ప్రారంభం

Satyam NEWS

కపిలతీర్థం వద్ద పార్కింగ్ సమస్యను పరిష్కరించండి

Satyam NEWS

18వ తేదీనే వినాయక చవితి

Satyam NEWS

Leave a Comment