39.2 C
Hyderabad
April 25, 2024 16: 00 PM
Slider వరంగల్

ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క పేరు పెట్టాలి

#mulugu

ములుగు జిల్లా కు సమ్మక్క సారక్క నామకరణం చేయాలని ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ ముంజల భిక్షపతి గౌడ్ డిమాండ్ చేశారు. ప్రజా సంఘాలు, ఆదివాసీ సంఘాలు, కుల సంఘాలు మహిళా సంఘాలు నేడు ఈ మేరకు కొత్తగూడ మండలం పెగడపల్లి గ్రామంలో సమావేశం నిర్వహించారు. అనంతరం ములుగు జిల్లా కు సమ్మక్క సారక్క పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ కరపత్రాన్ని ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ 18వ తేదీన మేడారం సమ్మక్క-సారక్క జాతరకు కుటుంబ సమేతంగా వస్తున్న సందర్భంగా తమ డిమాండ్ ను మరొక్క మారు వినిపిస్తున్నామని ముంజల భిక్షపతి గౌడ్ అన్నారు. ఇతర జిల్లాలకు దేవతల పేర్లు పెట్టారని అలాగే ములుగు జిల్లా కు ఎందుకు పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ములుగు జిల్లా కు, వన దేవతలు సమ్మక్క సారక్క పేర్లు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బత్తుల ప్రదీప్, చీమల రాజు, ఆల్ ఎం కృష్ణ, పోల బోయిన సీతక్క, పైడి బాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Related posts

శ్రీశైలంలో కన్నులపండువగా మహాశివరాత్రి  బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

ప్రధాని కిసాన్ సేవ కేంద్రాలుగా ఎరువుల రిటైల్ షాపులు

Satyam NEWS

రెండవ పంటకు నీటి విడుదల చేసిన వైస్ఎంపిపి

Satyam NEWS

Leave a Comment