27.7 C
Hyderabad
April 26, 2024 04: 27 AM
Slider ప్రత్యేకం

మారుమూల గ్రామాలకు నడచి వెళ్లిన వైద్యనారాయణుడు

#Mulugu Doctor

డాక్టర్లు ఈ మధ్య కమర్షియల్ అయిపోయారండీ అంటూ ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తుంటారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పని చేస్తున్న డాక్టర్లను చూసి కొంత మంది తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు.

మరి ఈ వైద్యాధికారిని చూస్తే అందరూ తమ అభిప్రాయం మార్చుకోవాల్సిందే. కాలినడకన… పూర్తిగా బురదలో ప్రయాణం చేసి మారుమూల గ్రామాలలో సైతం వైద్య సౌకర్యాలు అందిస్తున్నారు ములుగు జిల్లా వైద్యాధికారి అల్లే అప్పయ్య.

శుక్రవారంనాడు ఆయన ములుగు జిల్లా గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల్లో పర్యటన చేశారు. ఈ పర్యటనలో భాగంగా, డి ఏం హెచ్ ఓ మూడు కిలోమీటర్లు కాలినడకన పూర్తిగా బురద తో కూడుకున్న రోడ్డు ద్వారా ప్రయాణించారు. గోవిందరావుపేట మండలం లోని  ఫ్రూట్ ఫామ్ లో నిర్వహిస్తున్న రాట్ నిర్ధారణ పరీక్షల పనితీరును పరిశీలించారు.

అనంతరం ఆయన  స్వయంగా రాట్ నిర్ధారణ పరీక్షలు  నిర్వహించారు. అనంతరం అక్కడి నుండి పాజిటివ్ కేసుల వద్దకు వెళ్లి వారి ఆరోగ్య క్షేమ సమాచారం వారిని అడిగి తెలుసుకున్నారు. వారికి కొన్ని సలహాలు సూచనలు చేశారు.

వారికి పండ్లను పంపిణీ  చేశారు. 12  మంది కోవిడ్ పాజిటివ్ వ్యక్తులను, ఇంట్లో 14 రోజులు ఉండి చికిత్స తీసుకునే సదుపాయం లేని వారిని గుర్తించి, వారిని తరలించడానికి ఎటువంటి రవాణా సౌకర్యం లేదని గుర్తించి, ట్రాక్టర్ సహాయంతో బ్రిడ్జి వరకు తీసుకువచ్చి 108 వాహనం ద్వారా వాక్యం వై టి సి జాకారం కేంద్రానికి  తరలించారు.

అనంతరం అక్కడి నుండి తాడ్వాయి మండలంలోని జలగల వంచ, గుత్తి కోయగూడెం సందర్శించి అక్కడ ముందుగా రాట్ నిర్ధారణ పరీక్షల పనితీరును గమనించారు. 68 పరీక్షలు నిర్వహించగా ఒకటి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలిపారు.

ఆ గ్రామంలో 30 ఇళ్లలో 130 మంది జనాభా ఉన్నారు. గ్రామములో ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించి అక్కడే 60 మందికి మలేరియా రక్త పూతల సేకరించి టెస్టులు  నిర్వహించగా 1 మలేరియా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

అక్కడి నుండి తాడ్వాయి మండలంలోని కోడి శాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గొనపల్లి  గ్రామాన్ని సందర్శించి కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిని పరామర్శించారు. అదే గ్రామంలో ఎల్ ఎల్ ఐ ఎం దోమతెరలను పంపిణీ చేశారు.

అనంతరం గ్రామంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమ పనితీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న సీజనల్ వ్యాధుల, గురించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దోమలు పుట్ట కుంట, కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, జ్వరం వచ్చిన వారు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా రక్త పూతల తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో, వైద్యాధికారి డాక్టర్ సుకుమార్, డాక్టర్ అవినాష్ రామయ్య సబ్ యూనిట్ ఆఫీసర్, జంపయ్య ఆరోగ్య కార్యకర్త ఏఎన్ఎం సరిత ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

ప్ర‌జా తీర్పున‌కు గౌర‌వం.. మ‌రింత బాధ్య‌త‌గా ప‌ని చేయాలి

Sub Editor

అంగరంగ వైభవంగా భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణం

Satyam NEWS

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తో సర్పంచ్ ల ఫోరం ప్రతినిధుల భేటీ

Satyam NEWS

Leave a Comment