రోడ్డు ప్రమాదంలో ఓ ఉన్నతాధికారి ప్రాణాలు కోల్పోయారు. ములుగు జిల్లా పౌర సంబంధాల అధికారి శ్రీనివాస్ రావు గురువారం వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం గూడేప్పాడ్ గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారును ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ రావు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలిం,చారు. కాగా శ్రీనివాస్ రావు మృతి వార్త తెలుసుకున్న ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. బంధువులు, స్నేహితులు, సిబ్బంది, సహ అధికారులు తీవ్ర విచారంలో మునిగిపోయారు.
previous post