30.7 C
Hyderabad
April 23, 2024 23: 22 PM
Slider వరంగల్

వాన నీరు బయటకు వెళ్లక మురిగిపోతున్న గ్రామాలు

#mla sitakka

వర్షాలతో రోడ్లపై నిలుస్తున్న మురికినీటిని తొలగించి, శానిటైజేషన్  చేయించాలని, ముంపునకు గురి అయిన ఇండ్లకు నష్ట పరిహారం చెల్లించాలని ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క డిమాండ్ చేశారు. ఈ రోజు ఆమె గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో పర్యటించారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచి ఉండటాన్ని ఆమె గమనించారు.

మునిగిపోయిన ఇండ్లను ఆమె పరిశీలించారు. జిల్లా పంచాయితీ అధికారి కి ఈ మేరకు ఆమె ఫోన్ చేసి ఆదేశాలు జారీ చేశారు. ముంపునకు గురి అయిన ప్రాంతాలను ప్రభుత్వ అధికారులు పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపించి నష్ట పరిహారం ఇప్పించాలని కోరారు. అలాగే ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి, జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి పాల్గొన్నారు.

జిల్లా ఎస్.సి. సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, జిల్లా యూత్ అధ్యక్షులు బానోత్ రవి చందర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతరాంనాయక్, మండల యూత్ నాయకులు చింత క్రాంతి, ఎంపీటీసీలు గోపిదాసు ఏడుకొండలు, గుండెబోయిన నాగలక్ష్మి- అనిల్ యాదవ్, పస్రా గ్రామ సర్పంచ్ ముద్దబోయిన రాము, పస్రా గ్రామ అధ్యక్షుడు, ఉపసర్పంచ్ బద్దం లింగారెడ్డి, మండల సీనియర్ నాయకులు కణతల నాగేందర్ రావు, పాలడుగు వెంకటకృష్ణ, కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, జెట్టి సోమయ్య, సూదిరెడ్డి జనార్దన్ రెడ్డి, జంపాల చంద్రశేఖర్, పెండెం శ్రీకాంత్, పంగ శ్రీను, బర్ల సమ్మిరెడ్డి, కొర్ర శ్రీను, చెరుకుల సురేష్, మందడి ఉత్తరయ్య, వాసం శ్రావణ్, భూక్య సుక్య, విజయ, ఆగబోయిన కల్యాణి, వాసం పాపయ్య, వాసం సాంబయ్య, సనప రమేష్, మాడ నాగేశ్వరరావు, బర్ల కిరణ్, తండ రవి, పగడాల మల్లారెడ్డి, గాజుల కిరణ్, అరుజుల వాసుదేవ రెడ్డి తదితర నాయకులు కూడా పాల్గొన్నారు.

Related posts

కొత్త సీసీ రోడ్డు,కాల్వ‌లను ప్రారంభించిన విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే

Satyam NEWS

బిజెపి నేతపై దాడి చేసిన సిఐ జానకి రెడ్డిని సస్పెండ్ చేయాలి

Satyam NEWS

నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

Leave a Comment