28.7 C
Hyderabad
April 20, 2024 07: 32 AM
Slider వరంగల్

మాస్కులు ధరించని 243 మందిపై కేసులు

#MuluguPolice

ములుగు జిల్లాలో ప్రజలు అందరూ తప్పకుండా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి, చేతులను శుభ్రంగా కడుక్కోవడం ద్వారా కరోనా వ్యాధి వ్యాప్తి కాకుండా  సహకరించాలని ములుగు ఏ ఎస్ పి పోతరాజు సాయి చైతన్య అన్నారు.

కరొనా నియమ నిబంధనలు పాటించడం వలన మీ కుటుంబాన్ని కరొనా వ్యాధి బారిన పడకుండా రక్షించడంతోపాటు  సమాజానికి మేలు చేసినట్లవుతుందని, ములుగు జిల్లాలో కమాండ్ కంట్రోల్ రూమ్ కి అనుసంధానమై ఉన్న సీసీ కెమెరాల పర్యవేక్షణ ద్వారా మాస్కులు దరించని వారిని  గుర్తించి వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. 

జిల్లాలో ప్రధాన కూడళ్లలో కరొనా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.

ఇప్పటివరకు ములుగు  జిల్లాలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 82 ప్రకారం ఈ చాలన్ విధానం ద్వారా మాస్క్ ధరించని 243 వ్యక్తుల పై వెయ్యి రూపాయల ఫైన్ విధించామని, అలాగే రోడ్డుపై వాహనాల తనిఖీ తో పాటు మాస్కులు ధరించని వ్యక్తులను గుర్తించి వారిపై కూడా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Related posts

మారని ప్రైవేట్ ఆసుపత్రుల తీరు.. రోగుల నుంచి అధిక ఫీజుల వసూలు

Satyam NEWS

బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి

Bhavani

రూ.9.94 లక్షల కోట్లిచ్చి ప్రత్యేక హోదా ప్రకటించండి

Satyam NEWS

Leave a Comment