38.2 C
Hyderabad
April 25, 2024 13: 19 PM
Slider వరంగల్

సైబర్ క్రైమ్ కేసు ఛేదించిన ములుగు పోలీసులు

#mulugu police

ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన సైబర్ నేరానికి సంబంధించిన కేసును విజయవంతంగా పరిష్కరించి మూడు లక్షల 50 వేల రూపాయలు రికవరీ చేసినట్లు ములుగు ఏఎస్పి పోతరాజు సాయి చైతన్య తెలిపారు. వివరాలలోకి వెళితే జంగాలపల్లి గ్రామానికి చెందిన కొండ వెంకటరాజు అను అతడు ప్రైవేట్ ఉద్యోగం చేసుకునేవాడు.

కరోన కారణంగా ఇంటివద్దనే ఉంటూ ఆన్లైన్ వచ్చిన జియో మార్ట్ డీలర్ షిప్ గురించి  దానికి ఆన్లైన్ లో అప్లయ్ చేసుకొని దానికి వారు అడిగిన డాక్యూమెంట్స్, డబ్బులు ఆన్లైన్ లో పంపించాడు. సుమారు 8,90,000 రూపాయలు వారికి ఆన్లైన్ లో పంపాడు. ఆ తర్వాత ఆన్లైన్ లో అప్లికేషన్ కనిపించకుండా పోయింది.

కంపెనీ వారికి ఫోన్ చేసినా వారి నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. తర్వాత ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఈ విషయమై కొండ వెంకటరాజు ములుగు పోలీస్ వారిని ఆశ్రయించగా ములుగు పోలీస్ వారు కేసు నమోదు చేశారు. ములుగు CI, SI  వారి సిబ్బంది సుమారు సంవత్సర కాలంగా కేసు దర్యాప్తు చేసి వలపన్ని, తెలివిగా అతనే వచ్చేలాగా చేసి నిన్నటి రోజున పట్టుకున్నారు.

అతని పేరు మహింద్ర kv, (39) చౌటెల్లి గ్రామం, కుశాల్ నగర్ మండలం, కొడుగు జిల్లా, కర్ణాటక కు చెందిన వాడు. అతని నుండి నగదు 3,50,000  రూపాయలు రికవరీ చేసి అతని నుండి కావలసిన సమాచారాన్ని సేకరించి  అతన్ని జైలుకు తరలించారు. ఈ కార్యక్రమంలో ములుగు సీఐ గుంటి శ్రీధర్, ఎస్సై ఓంకార్ యాదవ్, ప్రొబేషనరీ ఉమెన్ ఎస్ఐ రాధిక, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

15 నుండి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం

Satyam NEWS

చైనా దుష్ట పన్నాగమే శ్రీలంక పతనానికి కారణం

Satyam NEWS

పెర్కెట్ మహిళా ప్రాంగణంలో ఎస్సి మహిళా అభ్యర్థులకు శిక్షణ

Satyam NEWS

Leave a Comment