36.2 C
Hyderabad
April 18, 2024 12: 12 PM
Slider వరంగల్

సైబర్ నేరాన్ని ఛేదించిన ములుగు సైబర్ పోలీసులు

#mulugupolice

గడుస్తున్న కాలంతోపాటు సాంకేతికత ఎంత అభివృద్ధి చెందుతున్నదో అదే సాంకేతికతను అడ్డం పెట్టుకొని కొందరు సైబర్ కేటుగాళ్లు మరోపక్క  ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనే ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సాపూర్ గ్రామం లో చోటు చేసుకుంది. దొడ్డే దిలీప్ అనే వ్యక్తి రివార్డ్స్ ఆన్లైన్ అప్లికేషన్ లో డబ్బులు గెలుచుకున్నారని  కొంత మొత్తం చెల్లిస్తే రివార్డ్ డబ్బులను పొందుతారని మభ్యపెట్టి 35 వేల రూపాయలు సైబర్ నేరగాళ్లు కాజేశారు.

ఆ విషయాన్ని దొడ్డే దిలీప్ ములుగు జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన ములుగు జిల్లా సైబర్ క్రైమ్  పోలీస్ బాధితుడు దగ్గర నుండి సమాచారాన్ని సేకరించి దాని ద్వారా ఉన్నతాధికారులను సంప్రదించారు. వారి సహాయంతో పదివేల రూపాయలు తిరిగి బాధితుడికి వచ్చేలా చేశారు. మిగతా డబ్బులను రికవర్ చేసేలా చర్యలను చేపట్టారు.

సోమవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ గాష్ ఆలం చేతుల మీదుగా పదివేల రూపాయలు  బాధితుడికి తిరిగి ఇచ్చారు. బాధితుడికి తిరిగి డబ్బులు అందించడంలో శ్రమించిన ములుగు జిల్లా సైబర్ క్రైమ్  పోలీస్ కానిస్టేబుల్ సయ్యద్ అబ్దుల్ రహీం ను ఎస్పీ ప్రశంసించారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ములుగు జిల్లా ప్రజలు ఎవరు కూడా ఆన్లైన్ మోసాలకు గురి కావద్దని, ప్రలోభాలను నమ్మవద్దని, తక్కువ మొత్తం లో నగదు పెడితే తిరిగి ఎక్కువ మొత్తంలో డబ్బులు గెలుచుకుంటారని, లాటరీలు తగిలాయంటూ, మొబైల్ ఫోన్స్ గిఫ్ట్ గా వచ్చాయంటూ తమ బ్యాంక్ వ్యక్తిగత వివరాలు వెల్లడించాలంటూ సైబర్ నేరగాళ్లు  అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ తమ వ్యక్తిగత సమాచారం, ఎ.టి.ఎం పిన్ నెంబర్ ఓ.టీ.పీ వంటి సమాచారాన్ని ఇతరులకు చెప్పవద్దని అసంబంధిత లింకులను క్లిక్ చేయవద్దని ఆన్లైన్ మోసాలకు గురి కావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ అనుకోని విధంగా సైబర్  మోసానికి గురి అయితే వెనువెంటనే  ములుగు జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ములుగు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సార్ల రాజు కానిస్టేబుల్ సయ్యద్ అబ్దుల్ రహీం పాల్గొన్నారు.

Related posts

కరోనా కేసులను ఆరోగ్య శ్రీ కిందకు తీసుకురావాలి

Satyam NEWS

మేఘన బేకరీని ప్రారంభించిన ములుగు ఎమ్మెల్యే

Satyam NEWS

కార్పొరేట్‌ బానిసత్వమే బీజేపీ లక్ష్యం

Bhavani

Leave a Comment