35.2 C
Hyderabad
April 20, 2024 17: 32 PM
Slider ప్రపంచం

ముంబయి విద్యుత్ గ్రిడ్ వైఫల్యం వెనుక చైనా కుట్ర బట్టబయలు

#MumbaiGridFailure

సరిహద్దుల్లో దొంగ నాటకాలు అడుతున్న చైనా, మన దేశంలోని పలు ప్రాంతాలలో వ్యవస్థల ప్రతిష్టంభనకు కుట్రలు పన్నుతున్నదా?

ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం వస్తున్నది.

సరిహద్దుల్లో కుట్రలు పన్ని భారత భూభాగాన్ని ఆక్రమిస్తున్న చైనా అంతర్గతంగా మన దేశంలో పలు సమస్యలు సృష్టిస్తున్నట్లు అమెరికాకు చెందిన ఒక కంపెనీ వెల్లడించింది.

భారత ఆర్ధిక రాజధానిగా పేరు పొందిన ముంబయి లో గత ఏడాది విద్యుత్ గ్రిడ్ విఫలం అయిన విషయం తెలిసిందే.

గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన విద్యుత్ గ్రిడ్ విఫలం కావడంతో ముంబయి మొత్తం రెండు గంటల పాటు స్తంభించి పోయింది.

బ్యాంకుల్లో లావాదేవీల నుంచి లోకల్ రైళ్ల వరకూ ఆగిపోయాయి. అన్ని విద్యుత్ వ్యవస్థలు స్తంభించి పోవడంతో ముంబయికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది.

సాధారణ జన జీవితం పూర్తి స్థాయిలో పునరుదర్ధరణ జరగడానికి కొన్ని రోజుల పాటు పట్టింది.

ఇంతటి ఉపద్రవానికి కారణం చైనాకు చెందిన ఒక సంస్థ మన విద్యుత్ గ్రిడ్ లో మాల్ వేర్ ను ప్రవేశ పెట్టడం వల్లే జరిగిందని తాజాగా అమెరికాకు చెందిన కంపెనీ వెల్లడించింది.

చైనాకు చెందిన రెడ్ ఎకో అనే గ్రూప్ భారత్ లోని పలు విద్యుత్ సంస్థలను టార్గెట్ చేసిందని అమెరికా కంపెనీ తెలిపింది.

ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ తో బాటు చాలా వ్యవస్థలు ఆటోమేటెడ్ మోడ్ లోనే నడుస్తుంటాయి. వీటన్నింటి డేటాను సర్వర్లు నిర్వహిస్తుంటాయి.

ఈ పాయింట్లను హైజాక్ చేసిన చైనా సంస్థ అక్కడ నుంచి మాల్ వేర్ ను ప్రవేశ పెట్టిందని అమెరికా సంస్థ కనిపెట్టింది.  

Related posts

కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు

Satyam NEWS

“ది కేరళ స్టోరీ”ని ప్రతి ఒక్కరూ చూడాలి

Bhavani

వాన తెచ్చిన కప్పలకు విడాకులు

Satyam NEWS

Leave a Comment