32.2 C
Hyderabad
March 29, 2024 00: 32 AM
Slider ముఖ్యంశాలు

ఏసిబి ట్రాప్ లో మహబూబ్ నగర్ మునిసిపల్ కమిషనర్

#ACBTrap

లంచం తీసుకుంటుండగా మహబూబ్ నగర్ మునిసిపల్ కమిషనర్ ను అవినీతి నిరోధక శాఖ ట్రాప్ చేసి పట్టుకుంది. ఈరోజు సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఆఫీసుపై ఏసీబీ దాడులు జరిగాయి.

మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ వడ్డె సురేందర్ లక్షా 65 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికాడు.

హైదరాబాద్ లో క్లోరినేషన్ మెటీరియల్ ను అలీ అహ్మద్ అనే వ్యాపారి సరఫరా చేస్తాడు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి కూడా క్లోరినేషన్ కెమికల్‌ను ఆయనే సరఫరా చేస్తుంటారు.

ఈ నేపథ్యంలో అతని టెండర్ పూర్తి కావడంతో దాని  పునరుద్ధరణ కోసం మున్సిపల్ కమిషనర్‌ను అలీ కలిశారు. అయితే రూ.15లక్షల టెండర్‌ను నామినేషన్ పద్దతిలో కలెక్టర్‌తో మాట్లాడి వచ్చేలా చేస్తాననీ, అందుకు దరఖాస్తు చేయాలని కమిషనర్ చెప్పారు.

చెప్పిన విధంగా దరఖాస్తు చేసుకున్న తరువాత అందులో 10శాతం అంటే లక్షా 65వేలు తనకు ఇవ్వాలని బాధితున్ని కమిషనర్ కోరాడు. ఏసీబీ అధికారులను బాధితుడు సంప్రదించాడు.

దీంతో ప్రణాళిక ప్రకారం కమిషనర్ సురేందర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

హైదరాబాద్ లోని ఏసీబీ కోర్టులో కమిషనర్‌ను శుక్రవారం ప్రవేశ పెట్టనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

Related posts

‘భవిష్యత్‌కు గ్యారంటీ’ పేరుతో టీడీపీ మేనిఫెస్టో

Satyam NEWS

23న హుజూర్ నగర్ ఆర్డీవో  కార్యాలయం ఎదుట జర్నలిస్టుల ఆందోళన

Satyam NEWS

సత్యం న్యూస్ చెప్పినట్లే కొట్టుకుపోయిన దేవాడ తాత్కాలిక రోడ్డు

Satyam NEWS

Leave a Comment