సోమవారం సాయంత్రం ఎన్నికల పురపాలక ఎన్నికలు షెడ్యూలు విడుదలైన సందర్భంగా అధికారులు అప్రమత్తమయ్యారు. కొల్లాపూర్ మున్సిపల్ కేంద్ర ప్రాంతంలో ఇకపై ఎవరు అనుమతులు లేకుండా ఎక్కడ రాజకీయపరమైన ఫ్లెక్సీలు, బ్యానర్స్ ఉంచరాదని కొల్లాపూర్ పురపాలక కమిషనర్ వెంకటయ్య తెలిపారు.
మంగళవారం ఉదయం కమిషనర్ వెంకటయ్య సత్యం న్యూస్ తో మాట్లాడారు. నేటి నుంచి మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఇక ఎవరు రాజకీయపరమైన మీటింగ్ లు, ప్రారంభోత్సవాలు చేయరాదని చెప్పారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో రాజకీయ పరమైన చర్చలు చేయరాదని తప్పుడు ప్రచారం చేయరాదని చెప్పారు.
అదే విధంగా ఇప్పటి వరకు కొల్లాపూర్ మున్సిపాలిటీ 20 వార్డులో మొత్తం 19145 ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఓటర్ల జాబితా సవరణకు గడువు ఉందని తెలిపారు. అధికారికంగా పూర్తి ఓటర్ జనవరి2వ తేదీన జాబితా తెలుస్తుందని చెప్పారు. పురపాలక కేంద్రంలో సిబ్బంది ఫ్లెక్షిలను తొలగిస్తున్నారు. రాజకీయ నాయకుల విగ్రహాలకు, జెండాలను మూసివేస్తున్నారు.
