33.2 C
Hyderabad
April 26, 2024 02: 59 AM
Slider హైదరాబాద్

మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆరో రోజు అన్నదానం

#munnurukapu

లాక్ డౌన్ కారణంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో  వివిధ ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ లో ఆకలితో అలమటిస్తున్న కరోనా బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు మున్నూరు కాపు సంఘం ఆహారం పంపిణీ కొనసాగిస్తున్నది.

6వ రోజు  వాయిస్ టుడే న్యూస్ ఛానల్ సహకారంతో  వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు (కాపు)నిత్య అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ మరియు తెలంగాణ మున్నూరు కాపు (కాపు) సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 

వద్దిరాజు రవిచంద్ర పటేల్, కొండ దేవయ్య పటేల్, అల్లం కిషన్ రావు పటేల్, కొత్త లక్ష్మణ్ పటేల్ ఈ కార్యక్రమానికి  సహకారం అందించారు.

హఫీజ్  పేట్ మున్నూరు కాపు సంఘం, శ్రీ కృష్ణా నగర్ మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కొండాపూర్ ఏరియా ఆసుపత్రి , TIMS Hospital Gachibowli, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, పంజాగుట్ట NIMS హాస్పిటల్, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్,LB నగర్ ప్రభుత్వ హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్ లలో ఆహారం పంపిణీ చేశారు.

కరోనా మహమ్మారి తో, ఇతర  ఇబ్బందులతో పడుతున్నటువంటి వారికి, వారి బంధువులకు సుమారు 2000 మందికి భోజనం ప్యాకెట్లను  అందించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో కాసారం రమేష్,పెరిక రమేష్, వాసాల వెంకటేశ్వర్లు , వాసాల రాజు, గంప సురేష్, ఆఫీస్ పెట్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Related posts

Autocrat : ఉక్రెయిన్ పై రష్యా ఉగ్ర (వాదం) రూపం

Satyam NEWS

3వ తేదీ నిరసనలు జయప్రదం చేయాలని కరపత్రం

Satyam NEWS

ప్రదర్శనకు తిరుమల శ్రీవారి ఆభరణాలు

Satyam NEWS

Leave a Comment