28.2 C
Hyderabad
April 20, 2024 11: 12 AM
Slider జాతీయం

కేంద్ర ఎన్నికల సంఘం అధికారులపై మర్డర్ కేసు

#madrashighcourt

కరోనా సెకండ్ వేవ్ కు ప్రధాన కారణం కేంద్ర ఎన్నికల సంఘం అని మద్రాస్ చీప్ జస్టిస్ తీవ్రంగా ఆక్షేపించారు. ఎన్నికల ప్రచారానికి అనుమతించిన కేంద్ర ఎన్నికల సంఘం కరోనా సెకండ్ వేవ్ కు కారణమని మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ బెనర్జీ అన్నారు.

‘‘బహుశ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులపై మర్డర్ కేసు పెట్టాలి’’ అని కూడా ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. పెరుగుతున్న కరోనా కేసులపై దాఖలైన పిటిషన్ ను విచారిస్తూ ఆయన తీవ్రంగా కలత చెందారు.

కేంద్ర ఎన్నికల సంఘం చేసిన నిర్వాకంపై ఆయన తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. కరోనా పాండెమిక్ సమయంలో పొలిటికల్ ర్యాలీలను అనుమతిస్తున్నందుకు భారత ఎన్నికల సంఘంపై మద్రాస్ హైకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రస్తుతం ఉన్న కరోనా సెకండ్ వేవ్ పరిస్థితికి ఎన్నికల సంఘమే కారణమంటూ చీఫ్ జస్టిస్ సంజీవ్ బెనర్జీ వ్యాఖ్యానించారు. ‘కోర్టులు పలుమార్లు ఆదేశాలు ఇస్తున్నాయి. అయినా పొలిటికల్ ర్యాలీలు తీస్తున్న రాజకీయ పార్టీలపై మీరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

మీ ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు పెట్టాలి’ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. కోర్టులు పలుమార్లు ఆదేశించినప్పటికీ ఎన్నికల ప్రచార సమయంలో కొవిడ్ నిబంధనలు అమలు చేయడంలో ఎన్నికల సంఘం విఫలమైందన్న విషయం చీఫ్ జస్టిస్ దృష్టికి వచ్చింది.

దీనిపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఎన్నికల ర్యాలీలు జరుగుతున్నప్పుడు మీరేమైనా వేరే గ్రహం మీద ఉన్నారా.. ఎందుకు చర్యలు తీసుకోలేదు.. అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఓట్ల లెక్కింపు రోజు కొవిడ్-19 ప్రోటోకాల్స్ అమలు చేసేందుకు తీసుకోబోయే చర్యలతో కూడిన యాక్షన్ ప్లాన్ బ్లూ ప్రింట్‌ను సమర్పించక పోతే మే2న జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియను రద్దుచేస్తామని ఎన్నికల సంఘాన్ని హెచ్చరించారు.

Related posts

స్థానిక ఎన్నికలంటే ఎందుకు ఇంత భయం???

Satyam NEWS

సత్యంన్యూస్ ఎఫెక్ట్ :పాతకాపుల ఉద్వాసనకు కొత్త నిర్ణయం

Satyam NEWS

హత్యకు వివాహేతర సంబంధమే కారణమా?

Sub Editor

Leave a Comment