32.7 C
Hyderabad
March 29, 2024 12: 39 PM
Slider ముఖ్యంశాలు

కేంద్ర ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు పెట్టిన అభ్యర్ధి భార్య

#election commission of India

కరోనా సమయంలో ఎన్నికలు నిర్వహిస్తూ భారీ బహిరంగ సభలకు, ర్యాలీలకు అనుమతిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు నమోదైంది.

కరోనా వ్యాప్తికి ప్రధాన కారణం కేంద్ర ఎన్నికల సంఘమే అని తమిళనాడు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

అంతే కాకుండా ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు పెట్టాల్సి వస్తుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

తమిళనాడు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడినట్లే పశ్చిమ బెంగాల్ లో కేంద్ర ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు నమోదయింది.

కరోనాతో టీఎంసీ అభ్యర్థి కాజల్ సిన్హా మృతి చెందారు.

దాంతో తన భర్త మృతికి కారణం కేంద్ర ఎన్నికల సంఘమే అని ఆరోపిస్తూ మృతుని భార్య నందితా సిన్హా ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు పెట్టారు.

బెంగాల్ 8 విడతల్లో ఎన్నికలు నిర్వహించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాజల్ సిన్హా ఖర్దా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన 25వ తేదీన కరోనాతో మరణించారు.

Related posts

ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం

Satyam NEWS

మణిపూర్ ఘటనకి కేంద్రం దే బాధ్యత

Satyam NEWS

దేవరకొండలో ఘనంగా ఫోటోగ్రఫీ దినోత్సవం

Satyam NEWS

Leave a Comment