ఏడు నెలల క్రితం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లికి చెందిన మండల బి.ఆర్.ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డిని హత్య నిందితులను అరెస్టు చేయాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఎస్.పికి విజ్ఞప్తి చేశారు. వనపర్తిలో ఎస్పీ రావుల గిరిధర్ ను కలిశారు. ఏడు నెలలు పూర్తయినా అరెస్టు చేయలేదన్నారు. స్పందించిన ఎస్.పి రావుల గిరిధర్ నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. బీరం హర్షవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ చాలా సమయం, ఓపిక పట్టామని, అతి త్వరలో ప్రజాక్షేత్రంలో ఉద్యమాలు చేస్తామని తెలిపారు. నిందితులను పట్టుకునే వరకు పోరాడుతామని అన్నారు. బీరం హర్షవర్ధన్ రెడ్డి వెంట జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, రాష్ట్ర బి.ఆర్.ఎస్ నాయకులు అభిలాష్ రావు,మాజీ ఎం.పి.పి సోమేశ్వరమ్మ,మాజీ జడ్పిటిసి వెంకట్రావమ్మ, మండల పార్టీ అధ్యక్షులు, కుటుంబ సభ్యులు ఉన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్