29.2 C
Hyderabad
September 10, 2024 17: 33 PM
Slider ఆదిలాబాద్

ప్రియుడితో కలిసి భర్త హత్య

POLICE

విచారణ లో నేరం అంగీకరించిన నేరస్తులు

దహెగాం మండలకేంద్రానికి చెందిన బండ మల్లేష్( 33),ఎల్లూర్ గ్రామానికి చెందిన చెనవేణి బాపు, భీమక్క ల కూతురు మంజుల అలియాస్ సుజాత (30)కి 13 సంవత్సరాలక్రితం పెళ్లయింది. 6సంవత్సరాల క్రితం సుజాత అదే గ్రామానికి చెందిన గుర్ల రాజు( 23 )తో అక్రమ సంబంధం ఏర్పరుచుకుంది. గత సంవత్సరం క్రితం మల్లేష్ కు విషయం తెలియడంతో గొడవపడి కొంత కాలం పాటు దూరంగా ఉన్నారు.4 నెలల క్రితం సుజాత తల్లిదండ్రులు మధ్యవర్తి ద్వారా మల్లేష్ తో మాట్లాడి ఇద్దరిని ఒక్కటి చేశారు. అయినా సుజాత తీరులో మార్పు రాకపోవడంతో తరుచు గొడవలు జరిగేవి.ఈ క్రమంలో సుజాత, ప్రియుడు రాజుతో కలిసి మల్లేష్ అడ్డు తొలగించుకోవాలనుకున్నారు.ఈ నెల 25 న సుజాత రాజు ప్రోత్సాహంతో మల్లేష్ గొంతును పిసికింది. దీంతో మల్లేష్ అన్న, సోదరి కరీంనగర్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ వైద్యం అందించి ఇంటికి తీసుకొని వచ్చారు .28న ఆరోగ్య పరిస్థితి విషమించడం తో మంచిర్యాల హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు.ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్ పంపించారు.

Related posts

బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కమిటీలో ఓయ విద్యార్థి నేత

Satyam NEWS

న్యాయమూర్తుల్ని దూషించిన మాజీ జస్టిస్ పై కేసు

Satyam NEWS

మహిళా డాక్టర్ మౌన పోరాటం

Bhavani

Leave a Comment