19.7 C
Hyderabad
January 14, 2025 04: 19 AM
Slider సినిమా

బిగ్‌బాస్ హౌస్‌లో ‘హత్యలు’

Punarnavi

బిగ్ బాస్ రియాల్టీ షో రసవత్తరంగా మారింది. బిగ్‌బాస్‌పై పునర్నవి భూపాలం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ”మీ గేమ్ మీరే ఆడుకోండి” అని కోపంతో విరుచుకుపడింది. అంతకుముందు బిగ్ బాస్ హౌస్‌లోని గార్డెన్ ఏరియాలో పునర్నవి కూర్చుంది. వెనక నుంచి బాబా భాస్కర్, శిల్ప, వితిక, హిమజ వచ్చి ఆమెను అమాంతం ఎత్తుకెళ్లి స్విమ్మింగ్ పూల్‌లో పడేస్తారు. అనంతరం పూల్ నుంచి బయటకు వచ్చిన పునర్నవి.. హౌజ్‌మేట్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.అది ఒకవేళ టాస్క్ అయినప్పటికీ.. అలా మ్యాన్‌హ్యాండ్లింగ్ చేయడమేంటని మండిపడింది. బిగ్‌బాస్ ఇవేం టాస్కులు అంటూ మండిపడటమే కాకుండా.. మీ గేమ్‌ని మీరే ఆడుకోమని.. వాకౌట్ చేసింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఇచ్చే రకరకాల టాస్కుల్లో భాగంగా మంగళవారం ”ఇంట్లోని కొంతమందిని దెయ్యాల పాత్రలు వేయించిన బిగ్‌బాస్‌ మిగతావారిని హత్య  దెయ్యాల పాత్రల్లోకి మార్చాలనే టాస్క్‌ ఇచ్చాడు. తొలుత వితికా, బాబా, హిమజ, రాహుల్‌, శిల్పాలు దెయ్యాల పాత్రలు పోషిస్తారని తెలిపాడు. ఈ దెయ్యాలు మనుషులను విసిగిస్తూ ఉండాలని చివరకు హత్య చేయాల్సి ఉంటుందని సూచించాడు’.”ఈ క్రమంలో శ్రీముఖిపై గుడ్డు పగలగొట్టాలని, వరుణ్‌కు మూడుసార్లు ముద్దుపెట్టాలని, బాత్రూం అద్దాలపై వరుణ్‌ ఈజ్‌ ఘోస్ట్‌ అని రాయాలని, మహేష్‌ చేత ఐదుసార్లు షర్ట్‌ విప్పేలా చేయాలని, పునర్నవిని స్విమ్మింగ్‌పూల్‌లో పడేయాలని, రవి చేత డ్యాన్సులు చేయించాలని, శివజ్యోతిని ఏడ్పించాలనే టాస్క్‌లను ఇచ్చాడు.దీంతో దెయ్యాల పాత్రధారులు బిగ్‌బాస్‌ హౌస్‌ను గందరగోళంగా మార్చారు. అందర్నీ ఏడిపిస్తూ, విసిగిస్తూ మనుషులను వేధించారు. ఈ క్రమంలో వరుణ్‌ సందేశ్‌కు వితికా మూడుసార్లు ముద్దుపెట్టింది. అనంతరం బాత్రూం అద్దాలపై వరుణ్‌ ఈజ్‌ ఏ ఘోస్ట్‌ అని రాయడంతో.. వరుణ్‌ హత్యకు గురైనట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. దీంతో వరుణ్‌ దెయ్యంగా, వితికా మనిషిగా మారింది. మరోవైపు శ్రీముఖి తలపై హిమజ గుడ్డు పగలగొట్టింది. దీంతో శ్రీముఖి సైతం హత్యకు గురైనట్లు ప్రకటించాడు. వితికా, శిల్పా, బాబా భాస్కర్‌లు కలిసి పునర్నవిని స్విమ్మింగ్‌ పూల్‌లో పడేశారు . టాస్క్ అయినప్పటికీ.. అలా మ్యాన్‌హ్యాండ్లింగ్ చేయడమేంటని మండిపడింది.కాగా బిగ్ బాస్ పునర్నవి కి ఏ విధమైన శిక్ష విధిస్థాడనేది బుదవారం రాత్రి తేలనుంది.

Related posts

ఎలిగేషన్: రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తున్నది

Satyam NEWS

హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులకు అన్న ప్రసాదం

Satyam NEWS

కోదండ రామునికి పద్మ శాలియుల పట్టు వస్త్రాలు

Satyam NEWS

Leave a Comment