38.2 C
Hyderabad
April 25, 2024 12: 16 PM
Slider నల్గొండ

ఈద్గా, ఖబరస్తాన్ పనులను పరిశీలించిన ముస్లిం మైనార్టీ నాయకులు

#muslims

పవిత్ర రంజాన్ మాసం పండుగను పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో పండుగ రోజు ఈద్గా వద్ద చేసే ప్రార్థనా స్థలాన్ని,ఖబరస్తాన్ శుభ్రం చేసిన పనులను ముస్లిం మైనార్టీ నాయకులు ఆదివారం  పరిశీలించారు.

ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ రాష్ట్ర నాయకులు మహ్మద్ అజీజ్ పాషా, షేక్ మన్సూర్ అలీ మాట్లాడుతూ మున్సిపాలిటీ వారు రంజాన్ పండుగ రోజున వచ్చే అతిథుల కొరకు టెంట్లు కుర్చీలు మంచినీటి సౌకర్యం కల్పించాలని,ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీస్ శాఖ వారు కూడా సహకరించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఖబరస్థాన్ లో రాత్రి సమయంలో అంత్యక్రియలకు లైటింగ్ లేకపోవటం వలన ఇబ్బంది కలుగుతుందని,నూతనంగా హెడ్ లైట్స్, ఐమాక్స్ లైట్లు అమర్చాలని మున్సిపల్ కమిషనర్,పాలకవర్గాన్ని కోరామని అన్నారు. ప్రార్థన చేసే ఈద్గా స్థలాన్ని ఖబ్రస్థాన్ ను శుభ్రం చేసినందుకు మున్సిపల్ వారికి ముస్లిం సోదరులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు నవాబ్ జానీ,మజీద్ రసూల్,జానీపాషా,ఇబ్రహీమ్, గౌస్,మోయిన్,డ్రైవర్ ముస్తఫా, ఆఫీస్, అఫ్రోజ్,సలీమ్ బాబా,రషీద్   తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

తరుగుతో రైతుల ఆదాయానికి గండికొడుతున్నా రైస్ మిల్లర్లు

Satyam NEWS

శ్రమ దోపిడిపై ఐక్య ప్రతిఘటనకు సిద్ధం కావాలి

Satyam NEWS

ఏకగ్రీవంగా ఎన్నుకుంటే అభివృద్ధికి అధిక నిధులు

Satyam NEWS

Leave a Comment