28.7 C
Hyderabad
April 20, 2024 07: 09 AM
Slider నల్గొండ

నామినేటెడ్ పదవుల్లో కూడా ముస్లింలకు అన్యాయం

#hujurnagarcongress

7 సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో కూడా ముస్లింలకి సరిఅయిన ప్రాధాన్యత లేకుండా పోయిందని టి పి సి సి జాయింట్ సెక్రటరీ ఎండి.అజీజ్ పాషా అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రహదారి బంగ్లా వద్ద గురువారం జరిగిన ముస్లిం మైనార్టీల సమావేశంలో ఆయన  మాట్లాడుతూ అధికారంలోకి రాగానే ముస్లింల స్థితి గతులపై సుధీర్ కమిటి ఏర్పాటు చేశారని, కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిందని, నివేదికలో రాష్ట్రవ్యాప్తంగా 85 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నరని వెల్లడి అయిందని ఆయన తెలిపారు.

అలాగే విద్యాపరంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబాటు తనానికి గురి అవుతున్నారని ఈ నివేదికలో పేర్కొనడం జరిగిందని అన్నారు. నాలుగు నెలల్లో 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తానని అన్నారు ఇంతవరకు జరగలేదు. పబ్లిక్ సర్వీస్ కమిటీ ఏర్పాటు చేయడం శుభ పరిణామమే అయినా రాష్ట్రంలో ముస్లింల జనాభా 15 శాతం ఉంటే ఏ ఒక్కరినీ కూడా  తీసుకోకపోవటం ముఖ్యమంత్రి కెసిఆర్ కి ముస్లింలపై ఎంత ప్రేమ ఉందో సామాజిక న్యాయం ఏమాత్రం పాటించారో దీనిని బట్టి అర్థమవుతుందని అన్నారు. కమిటీలో ముస్లిమ్ సభ్యులుగా లేకపోవటం వలన ఉద్యోగ ఉపాధి రంగాలలో ముస్లింలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన  వ్యక్తం చేశారు. కెసిఆర్ అధికారంలోకి రాగానే అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి వక్ఫ్ బోర్డుకి జ్యుడీషియల్ పవర్ కల్పిస్తామని అన్నా ఇంతవరకు అది జరగలేదని అజీజ్ పాషా అన్నారు.

అధికారంలోకి రాగానే ఉర్దూ భాషకి రెండవ ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక డీఎస్సీ ద్వారా ఉర్దూ టీచర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు కానీ నేటి వరకు అదీ జరగలేదని విమర్శించారు.కెసిఆర్ అధికారంలోకి రావటానికి ముందు ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పిన హామీ ఇచ్చిన మాట 7 సంవత్సరాలు దాటిందని,రెండు మార్లు ప్రభుత్వం ఏర్పడినా ఇచ్చిన హామీ నేరవేర్చకపోవడం శోచనీయమని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రిజర్వేషన్ల అమలు నివేదిక సమర్పించి ఎన్ని సంవత్సరాలు గడిచిందో పునరాలోచన చేయాలని అన్నారు.కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేయకపోతే ఢిల్లీలో సునామి సృష్టిస్తానని,జంతర్మంతర్ వద్ద ఆందోళన చేస్తామని కెసిఆర్ అన్నారని,రాష్ట్రంలో స్టేట్ మైనార్టీ ఫైనాన్స్  కార్పొరేషన్ చైర్మన్ నేటికీ భర్తీ కాలేదని,

నేటివరకు ఉర్దూ అకాడమి స్టేట్ ఛైర్మెన్ పోస్టు కూడా భర్తీ చేయలేదని,రాష్ట్రంలో ముస్లింలు తమ తమ సమస్యలను చెప్పుకోవడానికి ఇంతవరకు మైనారిటీ స్టేట్ కమీషనర్ ను కూడా ఏర్పాటు చేయకపోవడం విచిత్రమని అన్నారు.నేటి వరకు కేంద్ర ప్రభుత్వాన్ని రిజర్వేషన్ల విషయం ఏమైందో అని ఏనాడు అడగటం గాని,ప్రశ్నించటం గాని,ముస్లింల పక్షాన పోరాటం చెయ్యటం గాని జరగలేదని  అజీజ్ పాషా అన్నారు.

తన మాయమాటలతో కాలయాపన చేస్తున్నారని,ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.అసంఘటిత కార్మికుల లో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు వారికి ఆదరువు కు నేటికి ఏర్పాటు జరగలేదని వాపోయారు. రాష్ట్రంలో నేటి వరకు పూర్తి స్థాయిలో పాలక మండళ్లు, రాష్ట్ర హజ్ కమిటీ,వక్ఫ్ బోర్డు కమిటీలను ఏర్పాటు చేయలేదని,పబ్లిక్ సర్వీస్ కమిటీలో ఎనిమిది మంది సభ్యులు ఉండగా అందులో ఏ ఒక్కరికి ముస్లిం మైనార్టీ  సభ్యులుగా తీసుకోలేదని,రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనివర్శిటీలో ఇటీవల నియమించిన వైస్ ఛాన్సలర్ గా ఒక్క ముస్లిం మైనారిటీకి కూడా అవకాశం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే రాబోయే రోజుల్లో ముస్లిం మైనార్టీలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెపుతారని అన్నారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు షేక్.ఖాసిం సాబ్,ఎండీ సిరాజ్, ఎస్.కే అజ్ఞు, ఎండీ.అజహర్, ఎస్.డి.షాకిము, ఎస్.కె అహ్మద్,ఎస్.కె.సలావుద్దీన్,సుభానీ, ఎస్.కె.బిలాల్,ఎండీ.సోహెల్, షేక్.మీరా,ఎస్.కె.మోహిన్, ఎండి.ముస్తఫా, ఎండి.నజీర్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

40 పైసలు ఇవ్వమంటే రూ. 4000 కట్టమన్నారు

Sub Editor 2

ఆసుపత్రిలో ఆక్సిజన్ లేక ప్రాణం కోల్పోయిన జర్నలిస్ట్

Satyam NEWS

వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీపై కేసు

Satyam NEWS

Leave a Comment