36.2 C
Hyderabad
April 25, 2024 20: 09 PM
Slider విజయనగరం

తొణికిస‌లాడిన మాన‌వ‌త్వం…  హిందువుకు ఓ ముస్లిం వ్య‌క్తి అంత్య‌క్రియ‌లు….!

#dead body

ఎక్క‌డైన చిన్న గొడ‌వ జ‌రిగినా…దాన్ని భూత‌ద్దం చూసి..సెన్సేష‌న‌ల్ పెట్టి..టీఆర్పీ కోసం ప‌రుగులు పెట్టే మీడియా ఉండే ఈ స్మార్ట్ యగంలో ఇసుమంతైనా మానవ‌త్వం ఉంటుందాని ప్ర‌తీ ఒక్క‌రిలో ఉదయిస్తున్న ప్ర‌శ్న ఇది.

కాని  జిల్లాలో  ఇసుమంతే కర్మ‌..స్పందించే హృద‌యంతోపాటు సాయం చేసే చేతులు కూడా ఉన్నాయంటే న‌మ్ముతారా…? న‌మ్మ‌క‌త‌ప్ప‌దు. అదీ ఓ హిందూ శ్మ‌శాన వాటిలో ఓ  ముస్లిం వ్య‌క్తి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాడు..సాటి మనిషికి సాయం  చేసాడు.

సంప్ర‌ద‌యాల‌కు మతం అడ్డొస్తుందేమో గాని..మాన‌వ‌త్వాన్ని..తొటివారికి సాయం చేయాల‌న్న హృద‌యానికి మ‌తం అన్నది అడ్డురాద‌ని..అదీ ఓ ముస్లిం  అందునా ఓ ఖాకీ యూనీఫాం ధ‌రించే ఓ  సాధార‌ణ కానిస్టేబుల్ వ్య‌వ‌హ‌రించాడంటే  న‌మ్ముతారా…? అంటే న‌మ్మ‌క త‌ప్ప‌దు.

ఏపీ రాష్ట్రంలోని ఉత్త‌రాంద్ర లోని విజ‌య‌న‌గ‌రం జిల్లా త‌ర‌చూ మీడియాకు ఎక్కుతోంది..అదీ. సేవా కార్య‌క్ర‌మాలు చేసి.మ‌రీముఖ్యంగా ఖాకీ బ‌ట్ట‌లు వేసుకున్న పోలీసులు..ఆ సేవ‌లోముందుంటున్నారు.

తాజాగా… విజయనగరం  చెందిన ఓ రిటైర్డ్ టీచర్  ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూఈ నెట‌ 12న మృతి చెందారు. ఆయ‌న  కుటుంబ స‌భ్య‌ల‌కు కూడా క‌రోనా పాజిటివ్  రావ‌డంతో ఏ ఒక్క‌రూ ఆ మాస్టారు గారి అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించేందుకు ముందుకు రాలేదు.

దీంతో  రిటైర్ టీచ‌ర్ బంధువులు… విజయనగరం యూత్ ఫేస్ బుక్ పేజ్ అడ్మిన్  డెండాక‌ కానిస్టేబుల్ షేక్ ఇల్తామాష్ సహాయం కోరారు. దీంతో  కానిస్టేబుల్ షేక్ ఇల్తామాష్…తన  మిత్రుడు అంబులెన్స్ శివ తో కలిసి ప్రభుత్వ ఆసుపత్రి నుండి మృతదేహాన్ని దాసన్నపేట లో గల స్వర్గధామంకు తీసుకువ‌చ్చారు.

కరోనా కార‌ణంగా టీచ‌ర్ దుర్మ‌ర‌ణం చెంద‌డంతో  కానిస్టేబుల్ ఇల్తామాష్ అత‌ని  స్నేహితుడు కూడా బ్లూరంగు డ్ర‌స్ ధ‌రించి…, హిందూ సంప్రదాయ ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మానవత్వంతో స్పందించి, కరోనా బాధితునికి అంత్య క్రియలు నిర్వహించిన కానిస్టేబుల్ ఇళ్తామాష్ ను జిల్లా ఎస్పీ రాజకుమారి ఇతర అధికారులు అభినందించారు.

సంప్ర‌దాయం అన్న‌ది…మ‌నం పెట్టుకున్న ఓ అంట‌రాని త‌నం లాంటిద‌ని…మాన‌త్వానికి  ఏ చెత్త అంటుకోద‌ని మ‌రోసారి  కానిస్టేబుల్ షేక్  ఇల్తామాష్,అత‌ని స్నేహితుడు శివ చేసి చూపించారని అంటోంది…స‌త్యం న్యూస్.నెట్.

Related posts

హ్యాపీ బర్త్ డే: కొడుకు పుట్టిన రోజున పేదల్ని ఆదుకున్న తండ్రి

Satyam NEWS

నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు

Bhavani

కేఏ పాల్ కోడలి ఫిర్యాదుతో రాంగోపాల్ వర్మపై కేసు

Satyam NEWS

Leave a Comment