38.2 C
Hyderabad
April 25, 2024 14: 03 PM
Slider ముఖ్యంశాలు

కళ్లకు గంతలతో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపిన ముస్లిమ్ సోదరులు

#hujurnagar

ఉస్మానియా మసీదు(వక్ఫ్) షాపింగ్ కాంప్లెక్స్ షాపులను బహిరంగ వేలం వేయాలని డిమాండ్ చేస్తూ 11వ రోజు ముస్లిం సోదరులు శాంతియుత ఉద్యమం చేశారు. ముస్లిం సోదరులు గాంధేయ మార్గంలో చేస్తున్న ఉద్యమానికి ట్రావెల్స్ డ్రైవర్స్ అసోసియేషన్ తమ సంఘీభావం తెలిపారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మసీదు ఎదుట ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో ఉస్మానియా మసీదు(వక్ఫ్) షాపింగ్ కాంప్లెక్స్ కిరాయిలు పెంచాలని జరుగుతున్న ఉద్యమం బుధవారం 11వ,రోజుకి చేరుకుంది. శిబిరం వద్ద జరుగుతున్న ఉద్యమం దుకాణాల ఎదుట ముస్లిం సోదరులు కళ్లకు గంతలు కట్టుకుని మోకాళ్లపై కూర్చొని తమ నిరసనను,ఆవేదనను తెలియజేశారు.ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ నాయకులు షేక్.జానీ నవాబ్,

ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్. షరీఫ్ మాట్లాడుతూ హుజూర్ నగర్ పట్టణ ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న మసీదు షాపింగ్ కాంప్లెక్స్ గడువు ముగిసినా లీజుదారులు మసీదు కమిటీ  పెంచిన అద్దెలు 12 నెలలుగా  చెల్లించకుండా ఉండటం అధర్మమని అన్నారు.

కళ్లుండి చూడలేని వక్ఫ్ బోర్డు   అధికారులారా ఇకనైనా కళ్లు తెరవండని,మసీదు అభివృద్ధికి,సిబ్బంది జీతభత్యాలు కిరాయిలు ఇవ్వకపోవటంతో అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. క్షేత్ర స్థాయిలో విచారణ విచారణకు వచ్చిన వక్ఫ్ బోర్డు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటం సరికాదని అన్నారు.

హుజూర్ నగర్ పట్టణంలో అనేక మంది ముస్లింలు నిరుపేద వర్గాల నిరుద్యోగ యువత దుకాణాలు లేక వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారని,పెంచిన అద్దెలు చెల్లించలేని గడువు ముగిసిన లీజుదారుల దుకాణాలను రాష్ట్ర స్థాయి వక్ఫ్ బోర్డు   అధికారులు తక్షణమే స్పందించి లీజుదారులపై శాఖాపరమైన చర్యలు తీసుకొని విక్రయ దుకాణాలను బహిరంగ వేలం వేసి అర్హులైన ముస్లిం సోదరులకు కేటాయించి మసీదు ఆదాయాన్ని,వక్స్ బోర్డు ఆదాయాన్ని పెంచుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీల నాయకులు ఎండి.అజీజ్ పాషా, సయ్యద్.మున్న,రహీం పాషా,జహీర్, నాగూల్,గోరే మియా,శంషుద్దీన్, పెయింటర్ బాబా,సైదా,మజీద్, ఖయ్యుము,ముస్తఫా,షేక్.జానీపాషా, షేక్.మొయిన్, ఆసిఫ్, మున్నీర్, ఖదర్, రషీద్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

సీఎం జగన్ అజ్ఞానంతో విద్యా వ్యవస్థ అధ్వాన్నం

Satyam NEWS

ప్రేక్షకులకు చెప్పాల్సిన కథ ‘యశోద’

Bhavani

డాక్టర్ సుధాకర్ దళితుడు కాబట్టే ఇలా అవమానించారు

Satyam NEWS

Leave a Comment