జమీయతుల్ ఉలమా ఏ హింద్ ఆధ్వర్యంలో ఆల్ మైనారిటీస్ అసోషియేషన్ నెట్ వర్క్ సహకారం తో మౌలానా హుసైన్ అహ్మద్ మజాహిరీ అధ్యక్షతన విజయవాడ ధర్నా చౌక్ లో NRC-CAB-NPR లకు వ్యతిరేకంగా ఉపవాస దీక్ష చేపట్టారు.
JUH జాతీయ ప్రధాన కార్యదర్శి మౌలానా మహమూద్ అసద్ మాదని, తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు హఫీజ్ పీర్ షబ్బీర్గారి ఆదేశాల మేరకు మదర్ సా విద్యార్థులు ఉపవాస దీక్షతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ దీక్షలో ప్రత్యేక అతిథులుగా మదర్ సా చిన్నారులు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హుస్సేన్ మాట్లాడుతూ దేశంలో NRC-CAB-NPR లాంటి నల్ల చట్టాలు రాజ్యాంగ విరుద్ధంగా తీసుకువచ్చారని ఆయన అన్నారు.

రాజ్యాంగాన్ని నీరు కార్చుతూ మత వివక్షతో చేస్తున్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం బేషరతుగా ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. ముస్లిం మైనారిటీ లపై వివక్షతో చేస్తున్న ఈ చట్టాల్ని వెనక్కు తీసుకోని పక్షంలో ముస్లిం సామాజిక వర్గం విజయవాడ కేంద్రంగా అన్ని ముస్లిం సామాజిక వర్గాలు ఐక్యంగా ఎస్ సి, ఎస్ టి లతో కలుపుకొని రాష్ట్రవ్యాప్తoగా పర్యటనలు చేస్తామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ ముస్లిం మైనారిటీ నాయకులు అమన్ ప్రధాన కార్యదర్శి ఫారూఖ్ శిబ్లీ, సమతా సైనిక దళా విక్టర్ ప్రసాద్, సీనియర్ మైనారిటీ నాయకులు ఫతాఉల్లా, హఫీజ్ నియాజ్త, హఫీజ్ సమడ్, హఫీజ్ సాఫీ ఊమ్రి, ఖరీ అబ్దుల్ రెహ్మాన్, శ్వేత, ఫణి, మతాలకు అతీతంగా ప్రజలు పాల్గొన్నారు. ఇంకా రెండు రోజులు దీక్ష ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి విజయవాడలోని అన్ని ప్రజా సంఘాలు మద్దతు ఇచ్చాయి.