36.2 C
Hyderabad
April 24, 2024 20: 22 PM
Slider ఖమ్మం

సి‌పి‌ఆర్ పై అవగాహన వుండాలి

#cpr

ఆకస్మికంగా గుండెపోటుతో చనిపోతున్నవారిని సిపిఆర్ నిర్వహించడం ద్వారా  రక్షించవచ్చని ఆ దిశగా ప్రతి ఒక్కరు సిపిఆర్ పై అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఐడిఓసి లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సీపీఆర్ అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొని, స్వయంగా సీపీఆర్ ప్రక్రియ ఎలా చేపట్టాలో చూపి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జీవనశైలి ఆహారపు అలవాట్లు మారడంతో ప్రపంచవ్యాప్తంగా సడన్ కార్డియాక్ అరెస్టులు, ఆకస్మిక గుండెపోటులు పెరిగాయని, గుండెపోటుకు గురైన వారికి వెంటనే కారియో పల్మనరీ రీససిటేషన్ (సిపిఆర్) చేయగలిగితే ప్రాణాపాయం తప్పే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కరోనా తరువాత చిన్న వయసు వారికి కూడా గుండెపోటు వస్తున్నాయని, గుండెపోటు వచ్చిన వారికి వైద్యుని కొరకు వేచి చూడకుండా వెంటనే సిపిఆర్ నిర్వహించడం ద్వారా మరణాలు తగ్గించవచ్చని అన్నారు. ప్రాణానికి మించి ఏది లేదని, మన చుట్టుప్రక్కల వారు ఆకస్మికంగా గుండెపోటుతో కుప్పకూలిపోతే వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారమిస్తూ, వాహనం వచ్చే వరకు సీపీఆర్ చేస్తూ, ఊపిరి అందిస్తే ఒక నిండు ప్రాణాన్ని కాపాడొచ్చని అన్నారు.  ఈ దిశగా శిక్షణ పొందిన ట్రైనర్లతో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వారు తిరిగి ఇతరులకు శిక్షణ ఇస్తారని అన్నారు. ఆకస్మికంగా కుప్పకూలిన వ్యక్తిని పలకరించి, నాడి, ఊపిరి తీసుకుంటున్నారో పరిశీలించాలని, సీపీఆర్ ఎవరికి చేయాలో మంత్రి అవగాహన కల్పించారు. సిపిఆర్ నిర్వహించే ముందు ఆ వ్యక్తి నిజంగా గుండెపోటుకు గురయ్యారా లేదా  అని గుర్తించాలని సూచించారు.

ఇటీవల హైదరాబాద్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ సిపిఆర్ నిర్వహించడం ద్వారా ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడారని, ఆ స్ఫూర్తితో  ఫ్రంట్ లైనర్స్ కు శిక్షణ ఇవ్వడం ద్వారా కొందరి ప్రాణాలైనా కాపాడవచ్చనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. కార్యక్రమంలో సీపీఆర్ దశలపై కమీషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖచే రూపొందించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, జెడ్పి సిఇఓ అప్పారావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా. బి. మాలతి, జిల్లా అధికారులు, వైద్యాధికారులు, జెడ్పిటిసిలు, సర్పంచులు, ఎంపిటిసిలు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

పూజా కార్యక్రమాలతో సహస్ర ఎంటటైన్మెంట్స్ చిత్రం ప్రారంభం

Bhavani

ప్రజారోగ్య భద్రతే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం

Satyam NEWS

ట్రాజెడీ: కోడి కత్తి గుచ్చుకుని ఒకరి మృతి

Satyam NEWS

Leave a Comment