39.2 C
Hyderabad
March 29, 2024 15: 08 PM
Slider మహబూబ్ నగర్

కులం పేరుతో దూషించిన ఎస్ఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

#mala

మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ములే కేశవులు డిమాండ్

సిసి కెమెరాలతో దొంగలను కనిపెడుతున్నామని, ఒక్క సీసీ కెమెరా వంద కళ్లతో సమానమని, సిసి కెమెరాల కారణంగానే నేరాలు జరగకుండా అదుపు  చూస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతుంటారు. ఎవరైనా దొంగలు దొంగతనం చేసి వెళుతూ సిసి కెమెరాలు ఉంటే ధ్వంసం చేసి పోతుంటారు. మరి పోలీసులే సీసీ కెమెరా ఫుటేజీలు దాచిపెడుతుంటే వాళ్లను ఏమనుకోవాలని మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు  ములే కేశవులు ప్రశ్నించారు.

సిసి కెమెరా ఫుటేజీ దాచిపెడుతున్న కింది స్థాయి పోలీసు అధికారులను గుర్తించి ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే చట్ట వ్యవస్థలు అభాసుపాలవుతాయని ఆయన అన్నారు. అందుకే ఉన్నత స్థాయి పోలీసు అధికారులు ఆలోచించి ఇలాంటి ఘోరమైన తప్పులు చేసిన ఎస్సై ని వెంటనే విధుల నుంచి  తొలగించి వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి పోలీస్ లపై ప్రజలకు అవగాహన కల్పించాలని  మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు  ములే కేశవులు డిమాండ్ చేశారు.

మంగళవారం ఆయన మహబూబ్ నగర్ లో విలేకరులతో మాట్లాడారు. గత 2021,జూన్ రెండవ తేదీన కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఘటనపై పట్టణానికి చెందిన బాధితురాలు అవుట చైతన్య తెలంగాణ ఎస్సీ,ఎస్టీ కమిషన్, తెలంగాణ మహిళా కమిషన్  ఆశ్రయించిన సందర్భంగా  తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ జిల్లా ఎస్పీకి నోటీస్ లు జారీ చేసింది.

దీనిపై మాలల చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ములే కేశవులు స్పందించారు. కులం తక్కువ దానా అంటూ మాల కులం పేరుతో దూషించడమే గాకుండా అసభ్యంగా మాట్లాడిన  ఎస్సై జి. బాల వెంకట రమణ పై జిల్లా ఎస్పీ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జిల్లా ఎస్పీ నిష్పక్షపాతంగా విచారణ జరపి చర్యలు తీసుకోవాలి

కింది స్థాయి సిబ్బంది తప్పు చేస్తే చర్యలు తీసుకునే బాధ్యత పై స్థాయి అధికారికి ఉంటుంది. ఏడాది క్రితం ఈ ఘటన జరిగితే ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మూలే కేశవులు ప్రశ్నించారు. ఎవరైనా రాజకీయ నాయకుల వత్తిడి, సంఘ విద్రోహ శక్తుల బెదిరింపులు ఏమైనా ఉంటే  చెప్పాలన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దళిత మహిళలకు ఏకంగా  పోలీస్ ల నుండి రక్షణ లేకుండా పోయిందన్నారు. పోలీస్ లపై ప్రజలకు నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ఉన్నత స్థాయి అధికారులకు ఉందన్నారు. తన భర్తపై  తప్పుడు కేసులు పెట్టి దాడులు చేయడమే కాకుండా, కోర్టు రిమాండ్ కు ఆదేశించిన మళ్ళీ స్టేషన్ కు తీసుకుపోయి దాడి చేయడం,  దానిని  గుట్టు రట్టు కాకుండా చేయలని ప్రయత్నం చేశారు.

ఉదయం ఎస్ ఐ ఫోన్ చేసి పిలిపిస్తే వెళ్ళిన ఆమె భర్త ఇంటికి రాలేదని పిల్లలతో ఎర్రటి ఎండలో  పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. అక్కడ మహిళ అని చూడకుండా అసభ్యంగా ప్రవర్తించి,కులం పేరుతో దూషించారు. భయభ్రాంతులకు గురి చేశారు. గేట్ బయటకు తరిమారు. ఇదేమి ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఆయన ప్రశ్నించారు.

చట్టాలపై ప్రజలకు పోలీస్ లు అవగాహన కల్పించాలి. కానీ పోలీస్ లే చట్టాలను కాలరాస్తున్నారు. అంటే రాష్ట్రంలో  పోలీస్ వ్యవస్థ ఎలా  వుందో అర్థం అవుతుందన్నారు. ఇక రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎక్కడ ఉందని ప్రభుత్వాన్ని  ప్రశ్నించారు.

సీసీ కెమెరాలు దాచిపెట్టారు అంటే ఎంత పెద్ద తప్పు చేశారో

ఆధారాలు ఏవీ లేకుండా ఎస్ఐ చేసిన తప్పులు కప్పి పుచ్చుకోవడానికే సీసీ కెమెరాలను దాచిపెట్టారు. ఇక్కడనే పోలీస్ ల తీరు ఏ విధంగా ఉందో కనిపిస్తుందన్నారు. తక్షణమే ప్రభుత్వం ఎస్సై జి.బాల వెంకట రమణ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని  డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిపించాలన్నారు.

రౌడీలు, గుండాలు ఇండ్లపైకి  వచ్చి దాడులు చేస్తే ఆధారాలతో ఫిర్యాదు  ఇచ్చిన కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం లేదంటే కొల్లాపూర్ లో ఎంత కక్షపూరితంగా పోలీస్ వ్యవస్థ  నడుస్తుందో అర్థమవుతుందన్నారు. ఇదంతా ఎస్ఐ కావాలని చేయిస్తున్నట్టు ఉందన్నారు.

దళిత మహిళను అసభ్యంగా మాట్లాడి,కులం పేరుతో దూషించిన  ఎస్సై పై, సిబ్బంది పై జిల్లా ఎస్పీ నిష్పక్షపాతంగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఏడలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అవుట చైతన్య కుటుంబానికి రక్షణ కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పత్తి యాదయ్య, మంత్రి వెంకట రాములు, యం. కాంతారావు  తదితరులు పాల్గొన్నారు.

Related posts

రూ.2 వేల నోట్లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన

Bhavani

టెలిఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర సంస్థలతో ఆడిట్ కి సిద్ధమా?

Satyam NEWS

తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి విహారం

Satyam NEWS

Leave a Comment