28.7 C
Hyderabad
April 20, 2024 08: 45 AM
Slider నల్గొండ

హుజూర్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించిన న్యాక్ బృందం

#NACK

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో న్యాక్ బృందం గురువారం సందర్శించారు. న్యాక్ బృందం రెండు రోజుల సందర్శనలో భాగంగా మొదటిరోజు కళాశాలలోని అన్ని శాఖలను, అధ్యాపకుల రికార్డులను,కార్యాలయ రికార్డులను పరిశీలించారు. కళాశాల ప్రధానాచార్యులు మల్లారెడ్డి భీమార్జున రెడ్డి డిగ్రీ కళాశాలకు సంబంధించిన పూర్తి వివరాలను న్యాక్ బృందానికి వివరించారు. కళాశాలలోని సౌకర్యాల పట్ల,ఆటస్థలం,గార్డెన్,మున్నగు విషయాల పట్ల న్యాక్ బృందం తమ సంతృప్తి వ్యక్తపరిచారని భీమార్జున్ రెడ్డిదని తెలిపారు.

న్యాక్ బృందం చైర్మన్ మదన్ మోహన్ గోయల్,సభ్యులు కో- ఆర్డినేటర్ డాక్టర్ ప్రేమలత,డాక్టర్ బసవేశ్వర్ ఇవాలే కళాశాలను పరిశీలించి అధ్యాపక బృందానికి, కార్యాలయ సిబ్బందికి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు.కళాశాల విద్యార్థులను,పూర్వ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కలిసి కళాశాలపై వారి వారి అభిప్రాయాలను సేకరించారు.

ముగ్గురితో కూడిన న్యాక్ బృందం మొదటిరోజు తన పరిశీలనను పూర్తి చేసి శుక్రవారం రిపోర్టును తయారు చేసి యు.జి.సి. కి సమర్పించనున్నారని వారు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా కళాశాలకు ‘ఏ’ లేదా ‘బి’ గ్రేడ్ లభించిన ఎడల ప్రభుత్వము నుండి నిధులు వస్తాయని తద్వారా కళాశాల అభివృద్ధి చేసుకోవచ్చని ప్రధానాచార్యులు భీమార్జున రెడ్డి తెలిపారు.

మ్యాక్ బృందం పరిశీలన అనంతరం విద్యార్థినీ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు మ్యాక్ బృందాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ పరిశీలనలో భాగంగా కమీషనర్ ఆఫ్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్ జాయింట్ సెక్రెటరీ యాదగిరి కళాశాల ను సందర్శించారు.

ఈ కార్యక్రమంలో మ్యాక్ త్రిసభ్య కమిటీ బృందంతో పాటుగా కళాశాల అధ్యాపక,అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ,విద్యార్థులు,పూర్వ విద్యార్థులు,వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

యాక్సిడెంట్: శ్రీచైతన్య స్కూల్ బస్సు బోల్తా

Satyam NEWS

మూత్ర‌నాళ వ్యాధికి అధునాత‌న‌ శ‌స్త్రచికిత్స

Satyam NEWS

రుణ మాఫి అమలు చేయాలి

Bhavani

Leave a Comment