అక్కినేని హీరో నాగ చైతన్య, ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా ఒక సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గానే స్టార్ట్ అయ్యింది. తెలంగాణ అబ్బాయి, ఆంధ్ర అమ్మాయి కథగా వస్తున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి కొత్త విషయం బయటకి వచ్చి అక్కినేని అభిమానులని ఖుషి చేస్తుంది. మంచి ఫీల్ గుడ్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ మూవీ షూటింగ్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి ఫిబ్రవరి 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి శేఖర్ కమ్ముల ఈ సినిమాని డిసెంబర్ లోనే విడుదల చేయాలని ప్లాన్ చేసినా కూడా షూటింగ్ ఇంకా బాలన్స్ ఉండడంతో టైం తీసుకోని క్వాలిటీ ఇవ్వాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. జనవరిలో పెద్ద సినిమాల విడుదల ఉండడం, పైగా ఇది మంచి ప్రేమ కథ కావడంతో వాలెంటైన్స్ డే నాడు రిలీజ్ చేస్తే బాగుంటుందని దర్శక నిర్మాతలు నిరాయించారని తెలుస్తోంది. ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రానుంది. ప్రేమకథలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న అక్కినేని హీరో, ప్రేమికుల రోజున వచ్చి ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో చూడాలి.
previous post