23.2 C
Hyderabad
September 27, 2023 20: 29 PM
Slider సినిమా

నాగచైతన్య రష్మికలతో అదే నీవు

naga chaitnya

అక్కినేని నాగ చైతన్య రష్మిక హీరో హీరోయిన్లుగా ఒక సినిమా తెరకెక్కనుంది. అదే నీవు, అదే నేను… అనే టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లనుంది. అదే నీవు, అదే నేను అనే సినిమా ఏంటి? అందులో నాగ చైతన్య-రష్మిక కలిసి నటించడం ఏంటి? ఎప్పుడు అనౌన్స్ అయ్యింది? డైరెక్టర్ ఎవరు? ప్రొడ్యూసర్ ఎవరు? అంటారా? ఇప్పటికైతే ఆ ఇన్ఫర్మేషన్ బయటకి రాలేదు కానీ… నాగ చైతన్యకి ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ పూర్తి అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ బయటకి వస్తుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ యొక్క శాటిలైట్ హక్కుల్ని తామే కొనుగోలు చేశామని జెమినీ టీవీ ప్రకటించింది. ప్రొడక్షన్ హౌజ్ నుంచి కాకుండా, హీరో డైరెక్టర్ నుంచి కాకుండా ఒక శాటిలైట్ ఛానల్ నుంచి సినిమా అనౌన్స్ కావడం ఇదే మొదటి సారి. టైటిల్ చాలా పొయిటిక్ గా ఉంది, ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా సినిమా రానుందనే విషయం మాత్రం అర్ధమవుతుంది. రష్మిక, చైతన్యల కాంబినేషన్ కూడా ఆన్ స్క్రీన్ ఫ్రెష్ గా ఉంటుంది కాబట్టి ఈ మూవీ గురించి ఫైనల్ కన్ఫర్మేషన్ ఎప్పుడు బయటకి వస్తుందా అని అక్కినేని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

Related posts

నాంపల్లి కోర్టులో హాజరైన మాజీ ఎంపీ కవిత

Satyam NEWS

ఇంట్రోస్పెక్షన్: పౌరసత్వంపై ఇక చాలు తగ్గండి

Satyam NEWS

కామారెడ్డిలో విచిత్ర మాస్టర్ ప్లాన్

Bhavani

Leave a Comment

error: Content is protected !!